మిడిల్ ఈస్ట్ లో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా రాధాకృష్ణ పదవీ భాద్యతల స్వీకరణ

admin
Published by Admin — September 17, 2026 in Nri
News Image

భారతదేశానికి ఆర్ధిక పట్టుకొమ్మలుగా భావించె మధ్యప్రాచ్య (మిడిల్ ఈస్ట్) మరియు దూర ప్రాచ్య (ఫార్ ఈస్ట్) దేశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయిన రావి రాధాకృష్ణ గురువారం మంగళగిరిలో అధికారికంగా పదవి భాద్యతలు స్వీకరించారు.

ప్రమాణ స్వీకరణ కార్యక్రమంలో ప్రవాసీ వ్యవహారాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎపి ఎన్నార్టీస్ చెర్మెన్ డాక్టర్ వేమూరు రవి, తెలుగుదేశం పార్టీ ఎన్నారై గ్లోబల్ చీఫ్ డాక్టర్ పి. గురురాజ, రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ కె.బుచ్చిరాం ప్రసాద్, APNRTS డైరెక్టర్ నాగేంద్ర బాబు అక్కలి, పార్టీ సీనియర్ ప్రవాసీ నాయకులు చప్పిడి రాజశేఖర్, సౌదీ అరేబియా, కువైత్ తెలుగుదేశం ప్రవాసీ ప్రముఖులు జానీ బాషా మరియు పార్టీ నాయకులు ముజ్జమ్మీల్, నాగరాజు మరియు కుదరవెల్లి సుధాకర్ రావులు పాల్గొన్నారు.

గల్ఫ్ మరియు అరబ్బు, ఇజ్రాయిల్, సింగపూర్, మలేషియా, జపాన్, దక్షిణ కొరియా, చైనా మరియు తైవాన్ తదితర దేశాలలో అంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్షాన వ్యవహారాలను పరిశీలిస్తూ ఈ దేశాలతో మైత్రిను బలోపేతం చేసే ప్రభుత్వ ప్రతినిధిగా రాధాకృష్ణా వ్యవహారిస్తారు.

గతంలో ఒక్క గల్ఫ్ దేశాలతో కూడి మధ్యప్రాచ్య దేశాలకు మాత్రమే ఈ రకమైన ప్రత్యెక ప్రతినిధి హోదా ఉండగా దానికి దుబాయిలోని ప్రవాసీయుడు సినీ నటుడు అక్కినేని నాగార్జు వియ్యంకుడు, తెలుగు తెలియని జుల్ఫీ రవ్దీజిను అప్పటో వైయస్ జగన్ ప్రభుత్వం నియమించింది.

సౌదీ అరేబియాలోని చమురు రంగంలో పారిశ్రామికవేత్త అయిన రాధాకృష్ణాది స్వస్ధలం కోనసీమ జిల్లా సఖీనేటిపల్లి మండలం. గల్ఫ్ లో తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు

News Image
News Image
News Image
News Image
Tags
Radhakrishna took charge as special representative of ap government in middle East
Recent Comments
Leave a Comment

Related News

Latest News