బే ఏరియాలో రామ్ మిరియాల కాన్సర్ట్ గ్రాండ్ సక్సెస్

admin
Published by Admin — May 26, 2026 in Nri
News Image

కాలిఫోర్నియాలో బే ఏరియా ఎంటర్‌టైన్‌మెంట్స్ (BAE) మరోసారి సంగీత ప్రియులను ఉర్రూతలూగించింది. మిల్పిటాస్‌లోని ఇండియా కమ్యూనిటీ సెంటర్‌లో “Vibe with Singer Ram Miriyala Live” మ్యూజిక్ ఈవెంట్ ను విజయవంతంగా నిర్వహించింది. టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్, సంగీత దర్శకుడు, చౌరాస్తా బ్యాండ్ వ్యవస్థాపకుడు రామ్ మిరియాల లైవ్ కాన్సర్ట్ న వీక్షించేందుకు సంగీత ప్రేమికులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. చక్కటి సాయంత్రం వేళ ఆడిటోరియం మొత్తం ప్రేక్షకుల కేరింతలు, చప్పట్లతో మార్మోగిపోయింది. డీజే టిల్లు పేరు...వీడి స్టైలే వేరు...అంటూ రామ్ మిరియాల గాత్రానికి ఎన్నారైలు చిందులేశారు.

స్పాన్సర్లు:

 

మై పర్సూ (గోల్డ్ స్పాన్సర్)

నాగరాజ్ అన్నయ్య (పవర్డ్ బై)

కావ్య ఫుడ్స్, ఏపెక్స్ కన్సల్టింగ్ సర్వీసెస్, ఇన్‌స్టాసర్వీస్ (సిల్వర్ స్పాన్సర్లు)

సితారా ఇండియన్ క్యూజిన్ (ఫుడ్ స్పాన్సర్)

రామ్ మిరియాల తన టాలెంటెడ్ బ్యాండ్‌తో పాటు లైవ్ కాన్సర్ట్ చేయడం ఎన్నారైలకు మరిచిపోలేని అనుభూతినిచ్చింది. రామ్ మిరియాలకు అవార్డు తెచ్చిపెట్టిన “చిట్టి నీ నవ్వంటే” పాటకు పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ జోష్ తో డ్యాన్స్ చేశారు. మనసును హత్తుకునే మెలోడీలతో పాటు రొమాంటిక్ పాటలు, ఎనర్జీ ఇచ్చే పాటలు...ఇలా అన్నీ కలగలిపి రామ్ మిరియాల రచ్చ చేశారు. మొదటి పాట నుంచి చివరి పాట వరకు రామ్ మిరియాల, ఆయన టీం అదే ఎనర్జీ లెవల్స్ మెయింటెన్ చేశారు. అర్ధరాత్రి వరకు నాన్‌స్టాప్‌గా సాగిన ఈ కాన్సర్ట్ ను చివరి వరకు ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు.

బే ఏరియా లోకల్ బ్యాండ్ 6th Element ఓపెనింగ్ ప్రదర్శన ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత రామ్ మిరియాల వేదికను హోరెత్తించారు. బే ఏరియాకు ఆయన రావడం మూడోసారి. ఆయన కాన్సర్ట్ కు ప్రతి సారి ప్రేక్షకుల సంఖ్య పెరుగుతోందని నిర్వాహకులు చెబుతున్నారు. అమెరికాలో రామ్ మిరియాలకు ఉన్న క్రేజ్ కు ఇది నిదర్శనం.

బే ఏరియా తెలుగు సమాజం, అభిమానులు, వాలంటీర్లు, స్పాన్సర్లు, కళాకారులు అందరికీ BAE నిర్వాహకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. బే ఏరియా తెలుగు సమాజానికి సాంస్కృతిక, వినోద కార్యక్రమాలను అందించాలనే BAE యొక్క నిబద్ధతను ఈ ఈవెంట్ మరోసారి నిరూపించింది.

News Image
News Image
News Image
News Image
News Image
Tags
Bay area ram miriyala music concert success BAE
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News