విజయ్ సర్కార్ కు బిగ్ బూస్ట్

admin
Published by Admin — May 13, 2026 in Politics
News Image
తమిళనాడు రాజకీయాలు సినీ ఫక్కీలు ఉంటాయి. డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య ఆధిపత్య పోరు మొదలు ఆ రెండు పార్టీలను పక్కకు నెట్టి అధికారం చేపట్టిన టీవీకే వరకు తమిళ తంబీల తీర్పు అనూహ్యం. తమిళనాట ప్రజలే కాదు...పొలిటిషియన్ల తీరు కూడా ఎవరి ఊహకు అందదు. అన్నాడీఎంకే నుంచి 30 మంది ఎమ్మెల్యేలు పళని స్వామిపై తిరుగుబాటు చేసి టీవీకేకు మద్దతిస్తామంటూ ముందుకు వచ్చిన వైనం ఇందుకు క్లాసిక్ ఉదాహరణ. 
 
పళని స్వామితో తెగదెంపులు చేసుకున్నామంటూ ఏఐడీఎంకే షణ్ముగం ప్రకటించారు. తనతో పాటు ముఫ్ఫై మంది ఎమ్మెల్యేల మద్దతు టీవీకేకు ఉంటుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే షణ్ముగంతో టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ భేటీ అయ్యారు. ఏఐడీఎంకేకు ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలి అన్న విషయంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రేపు అసెంబ్లీలో టీవీకే బల పరీక్ష ఎదుర్కోబోతున్న నేపథ్యంలో అనూహ్యంగా 30 మంది ఏఐడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు రావడంతో విజయ్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. బొటాబొటిగా మెజారిటీ ఉన్న టీవీకేకు ఈ 30 మంది మద్దతు పెద్ద బూస్ట్ ఇచ్చినట్లయింది.
 
తాజా చీలికతో పళని స్వామికి బిగ్ షాక్ తగిలినట్లయింది. ఆల్రెడీ రెండు విడతలుగా అధికారం కోల్పోయిన ఏఐడీఎంకే కథ దాదాపుగా ముగిసినట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అమ్మ జయలలిత తర్వాత పార్టీని నడిపై బలమైన నేత లేకపోవడం పెద్ద మైనస్ అని, పార్టీలో లుకలుకల వల్ల మొదటికే మోసం వచ్చిందని చెబుతున్నారు.
 
 
Tags
tvk big boost cm vijay aidmk support floor test tamilnadu politics
Recent Comments
Leave a Comment

Related News