గల్ఫ్ దేశాల్లో.. ఘ‌నంగా బాబు బ‌ర్త్‌డే వేడుక‌లు!

admin
Published by Admin — April 21, 2026 in Nri
News Image

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) జన్మదిన వేడుకలు గల్ఫ్ దేశాల్లో అత్యంత వైభవంగా జరిగాయి. గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షుడు రాధాకృష్ణ రావి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ మరియు ఒమాన్ దేశాలకు చెందిన ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ వేడుకలకు ఏపీ రాష్ట్ర టీడీపీ(TDP) అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు అమిలినేని సురేంద్ర బాబు, గౌతు శిరీష, ఏపీ ప్రభుత్వ సలహాదారు, ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు డాక్టర్ రవి కుమార్ పి. వేమూరు, ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు విజనరీ నాయకత్వాన్ని, రాష్ట్రాభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు. ప్రవాసాంధ్రులు రాష్ట్ర అభివృద్ధిలో చురుకైన భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

చంద్రబాబు(Chandrababu) జన్మదినాన్ని పురస్కరించుకుని గల్ఫ్ దేశాల్లోని ఎన్ఆర్ఐ టీడీపీ విభాగాలు సామాజిక సేవా కార్యక్రమాలతో తమ నిబద్ధతను చాటుకున్నాయి. వివిధ దేశాల్లో రక్తదాన శిబిరాలు, పేదలకు అన్నదానం, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా యువత, మహిళా విభాగాలు స్థానిక భారతీయ సంఘాల సహకారంతో ఈ కార్యక్రమాలను విజయవంతం చేశాయి.

ఎన్ఆర్ఐలకు అండగా ఏపీఎన్ఆర్టీఎస్:
ప్రవాసాంధ్రులకు అందుతున్న సేవలపై ఏపీఎన్ఆర్టీఎస్(APNRTS) డైరెక్టర్ (ఆపరేషన్స్ & సర్వీసెస్) నాగేంద్ర బాబు అక్కిలి వివరణ ఇచ్చారు. అత్యవసర సహాయం, రిపాట్రియేషన్, వైద్య సాయం, లీగల్ సపోర్ట్ మరియు ఉద్యోగ మార్గదర్శకత్వం వంటి సేవలను ప్రవాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అలాగే ఈ సంబరాల్లో గల్ఫ్(Gulf) వ్యాప్తంగా ఉన్న కమిటీ సభ్యులు చురుగ్గా పాల్గొన్నారు. సౌదీ అరేబియాలోని రియాద్, జెడ్డా, దమ్మామ్, ఖోబర్ ప్రాంతాల నుండి ఖాలిద్ సైఫుల్లా, జాని బాషా షేక్, రాజశేఖర్ చెన్నుపాటి, సారధి నాయుడు వడ్లమూడి, శిల్ప గడ్డం, అక్షిత మందవ, నరేష్ చెన్నుపాటి, సుచరిత కందుల, ముజమ్మిల్ షేక్ మరియు జుబైల్ నుండి కోగంటి శ్రీనివాస్ రావు బృందం పాల్గొన్నారు.

ఖతార్‌లో గొట్టిపాటి రమణయ్య, నరేష్ మద్దిపాటి, రవి పొనుగుమాటి, బొడ్డు రామారావు సహా మహిళా విభాగం ప్రతినిధులు స్వప్న పొనుగుమాటి, వాణి సుఖవాసి, కిరణ్ కుమారి తదితరులు హాజరయ్యారు. ఒమాన్‌లో గరపాటి సత్య శ్రీధర్ రాఘవేంద్ర, కాంతేటి వాసు బాబు, రాజేష్, నాగరాజు మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.

దుబాయ్‌లో విశ్వేశ్వరరావు మోతుకూరి, తులసి కుమార్ ముక్కు, రాజా రవి, ప్రసాదు దరపనేని, రాయుడు శేష నూకరాజు వంటి వారు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. కువైట్‌లో కుదరవల్లి సుధాకర రావు, మద్దిన ఈశ్వర్ నాయుడు, వి.సి.సుబ్బారెడ్డి, రషీదా భేగం, వేణు గోపాల్ స్వామి బృందం పాల్గొంది. బహ్రెయిన్‌లో రఘునాథ్ బాబు, హరి బాబు, సతీష్ శెట్టి, మోహన్, ఏవి రావు తదితరులు వేడుకల్లో భాగస్వాములయ్యారు. చివరగా, గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షుడు రాధాకృష్ణ రావి(Gulf Council President Radhakrishna Ravi) కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అతిథులకు, సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో గల్ఫ్ ప్రాంతంలో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని తీర్మానించారు.

 

News Image
News Image
News Image
News Image
News Image
News Image
Tags
Chandrababu Naidu HBD Chandrababu Naidu CBN76 Andhra Pradesh TDP NRI TDP
Recent Comments
Leave a Comment

Related News