లండన్‌లోని కోవెంట్రీ నగరంలో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ యూకే తెలుగు యువత ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించారు. అనంతరం సీబీఎన్ 76వ జన్మదిన కేక్‌ను కట్ చేసి, అందరూ “జై బాబు, జై బాబు” అంటూ నినాదాలతో హోరెత్తించారు. కొంతమంది ఐటీ నిపుణులు చంద్రబాబు చేసిన అభివృద్ధి వల్లే ఈరోజు తమ జీవితాలు మెరుగుపడ్డాయని కొనియాడారు. తదుపరి బాణాసంచా కాల్చి నగరాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
ఈ కార్యక్రమంలో కోవెంట్రీ సిటీ తెలుగు యువత అధ్యక్షుడు లింగ రవితేజ, జయప్రకాశ్, నాయుడు, నాగేంద్ర, కామేష్, నటరాజ్, సందీప్, ప్రవీణ్, బోడే, సతీష్, హరి, కుమార్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.