ఊరూరా `విరోష్` పెళ్లి విందు.. ఇదెక్క‌డ మాస్ రా మామ‌!

admin
Published by Admin — March 01, 2026 in Movies
News Image

వెండితెరపై వారి జోడీ చూస్తేనే మురిసిపోయే ఫ్యాన్స్‌కు, ఇప్పుడు అసలైన `తీపి` కబురు అందింది. టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అయితే, ఈ సెలబ్రేషన్స్ కేవలం ఉదయ్‌పూర్ ప్యాలెస్‌కో లేక ఫైవ్ స్టార్ హోటల్స్‌కో పరిమితం కాలేదు. తమ పెళ్లి సంతోషాన్ని నేరుగా అభిమానుల గుమ్మం దగ్గరకు చేర్చాలని `విరోష్` జంట ఫిక్స్ అయిపోయింది. అందుకే, ఇదెక్కడి మాస్ రా మామ అనిపించేలా దేశవ్యాప్తంగా స్వీట్ ట్రక్కులను రంగంలోకి దింపారు.

సాధారణంగా సెలబ్రిటీల పెళ్లి అంటే ఫోటోలు చూసి మురిసిపోతాం. కానీ, విజయ్-రష్మిక రూటే సెపరేటు. ``మీరు మా ప్రయాణంలో భాగం.. అందుకే ఈ వేడుక మీతోనే!`` అంటూ మార్చి 1వ తేదీన తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో స్వీట్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ నుంచి విశాఖ వరకు, కరీంనగర్ నుంచి పుట్టపర్తి వరకు ఎంపిక చేసిన సెంటర్లలో స్వీట్ ట్రక్కులు సందడి చేస్తున్నాయి. పెళ్లి విందును ఇలా వెరైటీగా ప్లాన్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

కేవలం స్వీట్లతోనే సరిపెట్టకుండా, ఆధ్యాత్మికంగా కూడా ఈ జంట తమ పెద్ద మనసు చాటుకుంది. హైదరాబాద్‌లోని హరేకృష్ణ టెంపుల్, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, విశాఖ కనక మహాలక్ష్మి గుడి వంటి ప్రముఖ క్షేత్రాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తిని, బాధ్యతను, అభిమానాన్ని కలగలిపి విరోష్ ప్లాన్ చేసిన ఈ వెడ్డింగ్ ట్రీట్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఇప్పటికే ఉదయ్‌పూర్‌లో వైభ‌వంగా వివాహం చేసుకున్న‌ ఈ జంట, మార్చి 4న హైదరాబాద్‌లో అదిరిపోయేలా రిసెప్షన్ ఇవ్వబోతోంది. అయితే దానికి ముందే ఇలా అభిమానులు, సామాన్య అభిమానుల కోసం ఊరూరా విందు ఏర్పాటు చేయడం నిజంగా మాస్ ప్లానింగ్ అనే చెప్పాలి. మొత్తానికి విరోష్జంట తమ రియల్ లైఫ్ కెమిస్ట్రీతోనే కాదు, ఇలాంటి స్వీట్ గెస్చర్స్‌తో కూడా అందరి మనసు గెలుచుకుంటున్నారు.

Tags
ViRosh Wedding The Wedding Of ViRosh Vijay Deverakonda Rashmika Mandanna ViRosh Tollywood
Recent Comments
Leave a Comment

Related News