షాకింగ్ నిజం బయటకు వచ్చింది. హైదరాబాద్ బిర్యానీ(Hyderabadi Biryani) అన్నంతనే గుర్తుకు వచ్చే అతి కొద్ది ప్రముఖ రెస్టారెంట్లలో ఒకటి ప్యారడైజ్. హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ఈ రెస్టారెంట్లు ఉన్న సంగతి తెలిసిందే. ఖైరతాబాద్ లోని ఐమాక్స్ మల్టీఫ్లెక్స్ పక్కనే ప్యారడైజ్(paradise) రెస్టారెంట్ ఉన్న సంగతి తెలిసిందే. అందులోని నెయ్యి(ghee)ని శాంపిల్ తీశారు జీహెచ్ఎంసీ అధికారులు. ఈ హోటల్లో వినియోగిస్తున్న సుధీర్ ఇండస్ట్రీస్ కు చెందిన బ్రాండెడ్ నెయ్యిని శాంపిల్ గా తీసుకెళ్లారు.
దీనిని నాచారంలోని స్టేట్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ లో ఈ నెయ్యి నమూనాలను పరీక్ష కోసం ఇచ్చారు. వీటిని పరీక్షించిన సంబంధిత అధికారులు ఈ నెయ్యిని ఆన్ సేఫ్ గా తేల్చారు. అయితే.. నాచారం ల్యాబ్ రిపోర్టును సవాల్ చేయటంతో వాటిని మరోసారి పరీక్షించేందుకు వీలుగా మైసూర్ లోని ప్రయోగశాలకు పంపినట్లుగా జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ ఆ ల్యాబ్ టెస్టులోనూ అన్ సేఫ్(unsafe) గా తేలితే మాత్రం.. తయారీదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేయటం గమనార్హం.
జీహెచ్ఎంసీ నిర్వహించే రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా కొన్ని సంస్థల్లో కల్తీ నెయ్యిని తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. ఇందులో భాగంగా ఐమ్యాక్స్ పక్కనే ఉన్న ప్యారడైజ్ రెస్టారెంట్ లోనూ తనిఖీలు నిర్వహించారు. నెయ్యిని శాంపిల్ గా తీసుకెళ్లగా.. దాన్ని ల్యాబ్ కు పంపగా.. అందులో ఆన్ సేఫ్ ఫలితం రావటం గమనార్హం. ఈ నెయ్యి నాసిరకంగా ఉందన్న విషయాన్ని తేల్చారు.
ప్యారడైజ్ హోటల్ తో పాటు మరికొన్ని రెస్టారెంట్లలోనూ శాంపిల్ తీయగా.. ప్యారడైజ్ బిర్యానీలో వినియోగిస్తున్న నెయ్యి డేంజర్ అన్న విషయాన్ని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. దీంతో నగరంలోని పలు పెద్ద హోటళ్లలోనూ నాసిరకం.. కల్తీ నెయ్యిని వినియోగిస్తున్నట్లుగా గుర్తించినట్లుగా తెలిసింది.బిర్యానీ.. హలీమ్ ఇతరత్రా వంటకాల్లో వినియోగించే నెయ్యి కల్తీగా తేలుస్తున్నారు. ఈ నేపథ్యంలో మైసూర్ నుంచి వచ్చే రిపోర్టుతోమరింత క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. సో.. బయట అదే పనిగా బిర్యానీ తినే వారు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం మర్చిపోకూడదు.