సినిమాల్లోకి నారా దేవాంశ్‌.. భయపడుతున్న లోకేశ్‌.!

admin
Published by Admin — November 13, 2026 in Andhra
News Image

రాజకీయ కుటుంబాల వారసులు అంటే సాధారణంగా ముందుగా గుర్తొచ్చేది తండ్రీతాతల బాటలో పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టడమో, లేదంటే వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడమో. కానీ, నారా లోకేష్ ముద్దుల కుమారుడు నారా దేవాంశ్‌(Nara Devansh) మాత్రం ఎవరికీ అందని విభిన్నమైన రూట్‌లో దూసుకెళ్తున్నాడు. చిన్న వయసులోనే డిజిటల్ వరల్డ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. డైనోసార్ల నేపథ్యంతో విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచుతూ 'డైనో డీట్స్' (Dino Deeds) పేరిట పాడ్‌కాస్ట్, యూట్యూబ్ ఛానెల్‌ను రన్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

దేవాంశ్‌ కంటెంట్ క్రియేటర్ ప్రతిభ కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాలేదు. రీసెంట్‌గా జరిగిన విశాఖ పెట్టుబడుల సదస్సులో అపోలో ఆస్పత్రుల ఉపాధ్యక్షురాలు ఉపాసన(Upasana) ప్రత్యేకంగా దేవాంశ్‌ పాడ్‌కాస్ట్‌ను ప్రస్తావించారు. పిల్లల్లో ఇంతటి ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత ఉండటం అద్భుతమంటూ ఆమె ప్రశంసల జల్లు కురిపించారు. ఆ షో చూస్తుంటే మీ అబ్బాయి నిజంగా అసాధారణ ప్రతిభావంతుడిగా కనిపిస్తున్నాడని కొనియాడారు.

ఉపాసన మాటలకు స్పందించిన నారా లోకేష్(Nara Lokesh) ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. సరదాగా నవ్వుతూనే, కొడుకు గురించి ఆయన చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. "డైనోసార్ పాడ్‌కాస్ట్‌లో దేవాన్ష్ మాట్లాడే తీరు, వాడి కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు నిజంగా భయమేస్తోంది.. ఎక్కడ రేపు పొద్దున సినిమాలను తన కెరీర్‌గా ఎంచుకుంటాడో అనిపిస్తుంది" అంటూ లోకేష్ చమత్కరించారు. లోకేష్ సరదాగా  ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఏది ఏమైనా, పిల్లలు తమ టాలెంట్‌తో ఎప్పుడూ పేరెంట్స్‌ను ఆశ్చర్యపరుస్తూనే ఉంటారనడానికి దేవాంశ్‌ ప్రయాణమే చక్కటి ఉదాహరణ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Tags
Nara Devansh Nara Lokesh Dino Deeds Upasana Kamineni Viral News Andhra Pradesh
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News