జ‌న‌సేన పేరిట బిగ్ స్కామ్‌.. 7 కోట్లు నొక్కేసిన కిలేడీ!

admin
Published by Admin — November 12, 2026 in Politics, Andhra
News Image

రాష్ట్రంలో కలకలం రేపిన ఒక భారీ మోసం వెలుగు చూసింది. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో అమాయక నిరుద్యోగులను టార్గెట్ చేసి, ఏకంగా రూ. 7 కోట్లు కొల్లగొట్టిన వైనం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే.. అధికారంలో ఉన్న ప్రముఖ రాజకీయ పార్టీ పేరును అడ్డుపెట్టుకుని కొందరు కేటుగాళ్లు ప్లాన్ పక్కాగా అమలు చేశారు. జనసేన(Janasena) పార్టీ రాష్ట్ర కార్యాలయం, అక్కడి ప్రముఖ నేతల పేర్లను వాడుకుంటూ నిరుద్యోగులను నమ్మించారు. ఏలూరు, తణుకు ప్రాంతాలకు చెందిన సుమారు 34 మంది నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఈ దారుణానికి పాల్పడ్డారు. పార్టీ ఆఫీస్ అడ్రస్‌తో నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లను సృష్టించి మరీ మోసాలకు తెరలేపారు.

ఈ కుంభకోణానికి గగర ధరణి అనే మహిళా మాస్టర్ మైండ్‌గా వ్యవహరించినట్లు తేలింది. గతంలో ఒక జాబ్(Job) కన్సల్టెన్సీలో పనిచేసిన అనుభవంతో ఆమె ఈ దందాను పక్కాగా ప్లాన్ చేసింది. హైదరాబాద్‌లోని మేడ్చల్‌లో హాస్టల్ నడుపుతున్న పెద్దిరాజు అనే వ్యక్తితో కలిసి ఈ భారీ వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. జనసేన కీలక నేతలు శివ శ్రీనివాస్, కోట రుక్మిణిల పేర్లను చెప్పుకుంటూ బాధితులను నమ్మించి సుమారు రూ. 7 కోట్లు వసూలు చేశారు.

అయితే బాధితులకు ఇచ్చిన నకిలీ నియామక పత్రాలు, అనుమానాస్పద లావాదేవీల వ్యవహారం జనసేన పార్టీ పెద్దల దృష్టికి వెళ్లడంతో అసలు విషయం బయటపడింది. వెంటనే అప్రమత్తమైన జనసేన నేత శివ శ్రీనివాస్ రంగంలోకి దిగి మంగళగిరి(Mangalagiri) రూరల్ పోలీసులను ఆశ్రయించారు. పార్టీ పేరును, తమ పేర్లను అడ్డుపెట్టి మోసానికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. 34 మంది నుంచి కోట్లు ఎలా వసూలు చేశారు? ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. రాజకీయ పార్టీల పేర్లతో నిరుద్యోగుల బలహీనతలను ఆసరాగా చేసుకుని జరుగుతున్న ఇలాంటి మోసాలు ఇప్పుడు సర్వత్రా కలకలం రేపుతున్నాయి.

Tags
Janasena Job Scam Andhra Pradesh Cyber Crime AP News Mangalagiri Police
Recent Comments
Leave a Comment

Related News