ఈ ఎన్నికల్లోనూ హింసే వైసీపీ ఎజెండా!

admin
Published by Admin — November 06, 2026 in Politics
News Image

ఏపీలో  జిల్లా, మండ‌ల ప‌రిష‌త్ ఎన్నిక‌లు సీమ ప్రాంతంలో హింసాత్మ‌కంగా మారాయి. వైసీపీ నాయ‌కులు ఒక్క‌సారిగా రెచ్చిపోయారు. పోలింగ్ బూత్‌ల‌లోకి గుంపులుగా వెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే.. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన వైసీపీ కార్య‌క‌ర్త‌లు.. త‌మ వెంట తెచ్చుకున్న పెట్రోలు బాంబుల‌ను పోలింగ్ కేంద్రాల వ‌ద్ద విసిరేశారు. దీంతో తిరుప‌తి స‌హా ప‌లు ప్రాంతాల్లో ఘ‌ర్ష‌ణ‌లు హింసాత్మ‌కంగా మారాయి.

ఎక్క‌డెక్క‌డ‌...?

+ పులివెందుల మండలం ఎర్రిపల్లె పోలింగ్‌ కేంద్రం వ‌ద్ద‌కు వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకుని లోప‌లికి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఒక్క‌సారిగా నాలుగు పెట్రోల్ బాంబుల‌ను విసిరారు. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఓట‌ర్లు భీతిల్లి ప‌రుగులు తీశారు.

+ తిరుపతి జిల్లాలోని పెనగలూరు మండలంలో మండ‌ల ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లోనూ హింస చోటు చేసుకుంది. నల్లపురెడ్డిపల్లెలో వైసీపీ కార్య‌క‌ర్త‌లు బూత్‌లోకి చొర‌బ‌డేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ, పోలీసులు అడ్డుకోవ‌డంతో పోలింగ్‌ కేంద్రానికి సమీపంలో పెట్రోల్‌ బాంబులతో దాడి చేశారు. ఇక్క‌డ కూడా భారీ మంట‌లు చెల‌రేగ‌డంతో ఓట‌ర్లు ప‌రుగులు పెట్టారు.

+ జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లోని నందలూరులో పోలీసుల‌తో వైసీపీ కార్య‌క‌ర్త‌లు ఘ‌ర్ష‌ణ‌కు దిగారు. ఈ ప‌రిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలకు ప‌ని చెప్పారు.

+ క‌డ‌ప జిల్లాలోని ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాలకు చెందిన కొంద‌రు వ్యక్తులు అల‌జ‌డి సృష్టించే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

+ పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం చిలకలపల్లిలో వైసీపీ కార్య‌క‌ర్త‌లు ఘ‌ర్ష‌ణ‌కు దిగారు. టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై చేయి చేసుకోవ‌డంతో ఘ‌ర్ష‌ణ నెల‌కొంది. ఇక్క‌డ కూడా పోలింగ్ బూత్‌ల‌ను ఆక్ర‌మించే ప్ర‌య‌త్నం చేశార‌ని.. టీడీపీనేత‌లు ఆరోపించారు.

+ విజయనగరం జిల్లా గరివిడి పోలింగ్‌ కేంద్రం వద్ద వైసీపీ నేత‌లు జనసేన నేతలపై దాడికి పాల్ప‌డ్డారు. ఇరుపార్టీల నేతలు పరస్పరం నెట్టుకోవడంతో తోపులాట జరిగింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వ‌ర్గాల‌ను అక్క‌డ‌నుంచి పంపించేశాయి.

+ అనంతపురం జిల్లా కూడేరు మండలం మరుట్లలో పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ బాక్సు ధ్వంసం చేశారు. బ్యాలెట్ బాక్సును పోలింగ్ కేంద్రం నుంచి బయటకు విసిరేసిన వైసీపీ కార్య‌క‌ర్త‌లు దానిని రాళ్లతో బద్దలుకొట్టారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. అయితే.. వైసీపీ కార్య‌క‌ర్త‌లు.. పోలీసుల‌పై నే దాడికి పాల్ప‌డ్డారు. దీంతో ఇద్ద‌రు కానిస్టేబుళ్లు గాయ‌ప‌డ్డారు. 

Tags
Ycp leaders choose elections
Recent Comments
Leave a Comment

Related News