జాన్వీ డీప్ ఫేక్ వివాదం.. వ‌ర్మ చెప్పింది నిజ‌మేగా.!

admin
Published by Admin — October 04, 2026 in Movies
News Image

సోషల్ మీడియాలో సెలబ్రిటీల ట్రెండ్ ఒక్కోసారి ఏ విధంగా బెడిసికొడుతుందో రామ్‌గోపాల్ వర్మ తనదైన శైలిలో కళ్లకు కట్టారు. నటి జాన్వీ కపూర్(Janhvi Kapoor) 'చుట్టమల్లే' సాంగ్ డీప్‌ఫేక్ వీడియో వ్యవహారంలో కొందరు ప్రముఖులు చేసిన హడావుడిపై ఆయన సంధించిన ప్రశ్నలు ఇప్పుడు టాలీవుడ్‌‌లో హాట్ టాపిక్‌గా మారాయి. అసలు తప్పును ఎత్తిచూపే ప్రయత్నంలో సెలబ్రిటీలే స్వయంగా ఆ అశ్లీల కంటెంట్‌కు పబ్లిసిటీ ఇచ్చారన్న వర్మ వాదనలో లాజిక్ తీవ్రంగా చర్చనీయాంశమవుతోంది.

ఎక్కడో మూలన పడి ఉండాల్సిన ఓ చీకటి వీడియో గురించి, సోషల్ మీడియాలో పెద్ద పెద్ద సెలబ్రిటీలు సుదీర్ఘంగా చర్చించడం వల్లే అసలు నష్టం జరుగుతుందని ఆర్జీవీ(RGV) చెబుతున్నారు. ఎవరికైతే ఆ నీచమైన వీడియో గురించి అసలు సమాచారమే లేదో, ప్రముఖుల వరుస ట్వీట్ల పుణ్యమా అని వారందరూ దాని కోసం గూగుల్ లో వెతకడం మొదలుపెట్టారు. దీనివల్ల బాధితురాలికి అండగా నిలవడం పక్కన పెడితే, వ్యూస్ మరియు ట్రాఫిక్ పెంచి ఆఫెన్సివ్ కంటెంట్‌ను మరింత వైరల్ చేసినట్లయిందని ఆయన మండిపడ్డారు.

నిజానికి ఇక్కడ సెలబ్రిటీలు చేయాల్సింది సోషల్ మీడియాలో సానుభూతి పోస్టులు పెట్టి ట్రెండ్ చేయడం కాదని, నేరుగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఆ కేటుగాడిని పట్టుకోవాలని వర్మ(Varma) స్పష్టం చేశారు. నిందితుడిని అరెస్ట్ చేయించిన తర్వాత ఆ విషయాన్ని బయటపెడితే సమాజానికి ఒక గట్టి సందేశం వెళ్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, బాధితురాలి పేరును మళ్లీ మళ్లీ తెరపైకి తెచ్చి ప్రచారం చేయడం కూడా చట్టరీత్యా నేరం కిందకే వస్తుందని వర్మ గుర్తుచేశారు. మొత్తానికి చూస్తే, టెక్నాలజీ దుర్వినియోగం వల్ల జరిగే నేరాలపై పోరాడాల్సిన పద్ధతి ఇది కాదని ఆర్జీవీ తనదైన శైలిలో కుండబద్దలు కొట్టారు. కేవలం విజిబిలిటీ కోసం లేదా ట్రెండింగ్‌లో ఉండటం కోసం కొందరు ప్రముఖులు చేసే హడావుడి వల్ల ఉపయోగం కంటే అనర్థమే ఎక్కువ జరుగుతుందన్న వర్మ మాటల్లో అక్షరాల నిజం ఉందని నెటిజన్లు కూడా అభిప్రాయపడుతున్నారు.

Tags
RGV Ram Gopal Varma Janhvi Kapoor Devara Chuttamalle Deepfake Tollywood
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News