సినీ పరిశ్రమలో ఎవరికీ లేని విధంగా విలక్షణ పాత్రలతో, తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్(Varalaxmi Sarathkumar) మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవలే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఈ స్టార్ హీరోయిన్, తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించి తీసుకున్న ఒక బోల్డ్ అండ్ షాకింగ్ డెసిషన్ ఇప్పుడు నెట్టింట పెను సంచలనం సృష్టిస్తోంది.
సాధారణంగా పెళ్లయిన కొత్త జంటల విషయంలో అందరిలోనూ పిల్లల గురించిన చర్చే నడుస్తుంది. కానీ, వరలక్ష్మి(Varalaxmi) మాత్రం ఈ విషయంలో పూర్తిగా భిన్నమైన దారిని ఎంచుకున్నారు. తనకు సంతానం వద్దంటూ ఆమె తన భర్తతో కలిసి స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టేశారు. "పిల్లలను కనలేక కాదు, నాకు స్వచ్ఛందంగానే పిల్లలు వద్దు అనుకుంటున్నాను" అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విప్లవాత్మక నిర్ణయం వెనుక ఆమె ఆలోచనా విధానం ఏంటనేది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఈ అంశంపై ఆమె మరింత స్పందిస్తూ, పిల్లలను కనడం అనేది కేవలం ఒక తంతు కాదని, అది ఎంతో పెద్ద బాధ్యత అని తేల్చిచెప్పారు. ఆ బాధ్యతను మోసేందుకు పూర్తిగా మానసికంగా సిద్ధంగా లేనప్పుడు, పిల్లలను కనడం కరెక్ట్ కాదనేది ఆమె వాదన. అంతేకాదు, తన భర్త మొదటి వివాహం ద్వారా వచ్చిన కూతురిని తన సొంత బిడ్డలాగే అక్కున చేర్చుకుంటున్నామని, అలాగే తమ ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కలను కూడా కంటికి రెప్పలా చూసుకుంటూ వాటినే తమ పిల్లలుగా భావిస్తున్నామని ఆమె తెలిపారు.
ఇది పూర్తిగా తన సొంత నిర్ణయమని, దీనిపై ఇతరుల జోక్యం కానీ, ప్రశ్నలు కానీ అనవసరమని ఆమె స్పష్టం చేశారు. కేవలం నటిగానే కాకుండా, ఇటు దర్శకత్వ రంగంలోనూ సరికొత్త ప్రయోగాలు చేస్తూ బిజీగా ఉన్న వరలక్ష్మి.. వ్యక్తిగత జీవితంలోనూ ఇంతటి బోల్డ్ నిర్ణయం తీసుకోవడం పట్ల ఇప్పుడు సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియా(Social Media)లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.