జగన్ హయాంలో నోరు మెదపలేదుగా షర్మిల?

admin
Published by Admin — November 05, 2026 in Politics
News Image

ఏపీలో వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తమ పాలనతో ప్రజల మన్ననలు పొందిన కూటమి ప్రభుత్వం విజయం ఊహించినదే. అయితే, ఆడలేక మద్దెల ఓడు అన్న రీతిలో వైసీపీ నేతలు రిగ్గింగ్, బూత్ క్యాప్చర్ అంటూ పస లేని నిరాధార ఆరోపణలతో విమర్శలు చేస్తున్నారు. తాజాగా వైసీపీ నేతలకు వైఎస్ షర్మిల కూడా వత్తాసు పలికారు.

ఓట్లు మీరే వేసుకొని గెలుపు మీదేనని ప్రకటించుకుంటే ప్రజలతో, ప్రజాస్వామ్యంతో పనేంటని షర్మిల ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో పారదర్శకత లేదని, స్వేచ్ఛ, నిష్పక్షపాతం లేవని విమర్శించారు.

కూటమి పార్టీల విజయం ప్రజా తీర్పు కాదన్నారు షర్మిల. అధికార మదం, రాక్షసత్వం వంటి వాటికి ఈ విజయం తార్కాణమని విమర్శించారు. ఎన్నికల సంఘాన్ని కూటమి సంఘం చేశారని, పోలీసు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొని ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు. దేశ చరిత్రలో ఎక్కడా ఈ తరహా ఎన్నికలు జరగలేదని, పొరుగు రాష్ట్రాల ముందు ఏపీ పరువు తీశారని షర్మిల మండిపడ్డారు.

అయితే, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలికి విమర్శించే హక్కులేదు అని విమర్శలు వస్తున్నాయి. పొరపాటున కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేసినా డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదని అంటున్నారు. కానీ, షర్మిల మాత్రం కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని చురకలంటింస్తున్నారు. మరి, వైసీపీ హయాంలో ఎన్నికల సమయంలో జరిగిన అక్రమాలపై షర్మిల అప్పుడు ఎందుకు మాట్లాడలేదని నిలదీస్తున్నారు.

Tags
Sharmila comments on local body elections results
Recent Comments
Leave a Comment

Related News