అడుసు తొక్కనేల..కాలు కడగనేల అనే సామెత ఉంది... వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈ సామెత అతికినట్లు సరిపోతుంది. గత ఎన్నికల్లో తాము అక్రమాలకు పాల్పడ్డాం కాబట్టే ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యామని అంబటి చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని చెబుతూనే తాము దారుణంగా ఓడిపోయామని అంగీకరించారు.
వైసీపీ హయాంలో కూడా స్థానిక ఎన్నికల సందర్భంగా అక్రమాలు జరిగాయి కదా అంటూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు అంబటి పై విధంగా జవాబు ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు తాము అక్రమాలకు పాల్పడ్డాం కాబట్టే ఇప్పుడు తమకు ఈ గతి పట్టిందని అంబటి అన్నారు. అయితే, ఏపీలో ఏ ఎన్నికలు జరిగినా ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయంటూ అంబటి హెచ్చరించారు. అంటే 2029లో వైసీపీ అధికారంలోకి వస్తే ఇంతకన్నా దారుణంగా ఘోరాలు చేసి ఎన్నికలు జరుపుతామని అంబటి పరోక్షంగా చెప్పినట్లయింది.
మద్యం రవాణా కేసులో ఈడీ విచారణకు హాజరైన అంబటి ఈ వ్యాఖ్యలు చేశారు. వాసుదేవరెడ్డితో తాను మాట్లాడిన మాట వాస్తవమేనని, సుబ్బారెడ్డి, పురుషోత్తం అనే వైసిపి నాయకులకు మద్యం రవాణా సబ్ కాంట్రాక్టు ఇవ్వాలని సిఫారసు చేశానని అంబటి అంగీకరించారు. అందుకు సంబంధించిన విషయాలరె ఈడీ అధికారులతో పంచుకున్నానని తెలిపారు.