ఈ సోషల్ మీడియా రోజుల్లో సెలబ్రెటీల ప్రవర్తన, మాటతీరు ఏమాత్రం కట్టుదాటినా కష్టం. చిన్న చిన్న కామెంట్లను పట్టుకుని.. వాళ్లు నటించే సినిమాల మీద నెగెటివిటీ క్రియేట్ చేసి అన్ పాపులర్ చేసి పడేస్తున్నారు నెటిజన్లు. మొదట్నుంచి నో నాన్సెన్స్, నో కాంట్రవర్శీ అన్నట్లు సాగిపోయిన సాయిపల్లవి.. కొన్నేళ్ల ముందు చేసిన ఒక తెలుగు ఇంటర్వ్యూలో ‘కశ్మీర్ ఫైల్స్’ ప్రస్తావన తెచ్చి చేసిన కామెంట్లు ఎంత వివాదాస్పదం అయ్యాయో తెలిసిందే. ఇక అప్పట్నుంచి ఆమెను హిందూ వాదులు టార్గెట్ చేస్తూ వస్తున్నారు.
‘రామాయణం’లో సాయిపల్లవిని సీత పాత్రకు తీసుకోవడం మీద తీవ్ర వ్యతిరేకత చూపించారు. సాయిపల్లవి నటించిన ఏ సినిమాకూ రాని హేట్రెడ్ ఈ చిత్రం విషయంలో చూస్తున్నాం. ఇలాంటి టైంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సాయిపల్లవి, లాస్ ఏంజెల్స్‌లో ఏర్పాటు చేసిన ‘రామాయణం’ ప్రిమియర్ అనంతరం చేసిన ఒక కామెంట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా ామరింది.
రావణుడి పాత్ర గురించి స్పందిస్తూ.. ‘‘రావణుడు పూర్తిగా చెడ్డవాడేమీ కాదు. మనలోని రావణుడిని గుర్తించి, కొన్ని మార్పులు చేసుకోవాలి’’ అని కామెంట్ చేసింది సాయిపల్లవి. నిజానికి ఆమె మాటల్లో తప్పేమీ లేదు. రావణుడిలో కొన్ని మంచి లక్షణాలు కూడా ఉన్నాయి. సీతను చెరబట్టడం, రాముడితో యుద్ధం చేసి తన చేతిలో చావడం ఇదంతా పక్కన పెడితే.. మహా శివ భక్తుడిగా రావణుడిలోని గొప్ప లక్షణాలను కూడా కొన్ని సినిమాల్లో ఫిలిం మేకర్స్ హైలైట్ చేశారు.
ఐతే జనం ఇవన్నీ ఆలోచించరు. సాయిపల్లవి రావణుడు మంచోడే అందని మాత్రమే ప్రచారం చేస్తారు. అసలే ఆమె మీద ఆల్రెడీ హేట్రెడ్ నడుస్తోంది. ఆమె మీద యాంటీ నేషనల్ అని, హిందూ వ్యతిరేకి అని ముద్ర వేసేశారు. ఇలాంటి టైంలో రావణుడు మరీ అంత చెడ్డవాడు కాదు అని కామెంట్ చేస్తే, మొత్తం కాంటెక్స్ట్ చూడకుండా ఆమెను ట్రోల్ చేసి, ‘రామాయణం’ సినిమా మీద వ్యతిరేక ప్రచారం చేస్తారు నెటిజన్లు. అందుకే ఈ టైంలో సాయిపల్లవి ఇలాంటి కామెంట్ చేయకుండా ఉండాల్సింది.