జనసేన నేతలకు పవన్ కీలక సూచన

admin
Published by Admin — October 28, 2026 in Andhra
News Image

ఏపీలో కూట‌మి ఐక్య‌త అత్యంత కీల‌క‌మ‌ని జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు. కూట మి ఐక్య‌త‌కు భంగం క‌లిగించేలా నాయ‌కులు వ్య‌వ‌హ‌రించ‌వ‌ద్ద‌ని ఆయన కోరారు. ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో కూట‌మి అగ్ర‌నేత‌లు.. సీఎం చంద్ర‌బాబు, బీజేపీ ఏపీ చీఫ్ మాధ‌వ్‌తో క‌లిసి ప‌వ‌న్ క‌ల్యాణ్ మీడియాతో మాట్లాడారు. కూటమి అభ్యర్థులకు క్షేత్రస్థాయిలో చాలా స‌వాళ్లు ఉంటాయ‌ని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు క్షేత్రస్థాయికి వెళ్లాలంటే అంతా ఐక్యంగా పనిచేయాలని సూచించారు.

⁠2024 సాధారణ ఎన్నికల్లో 94 శాతం అసెంబ్లీ స్థానాలు ఐక్యంగా ముందుకు వెళ్లి గెలుచుకున్నామ‌న్న ప‌వ‌న్.. అలాం టి గెలుపే మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో రావాల‌ని.. దీనికిగాను అన్ని పార్టీల నాయకులు ఐక్యంగా ముందుకు సాగాల‌ని కోరారు. చాలా చోట్ల ఔత్సాహిక కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు సైతం భారీ సంఖ్య‌లో నామినేషన్లు వేశార‌ని, వారి ఆశావాదాన్ని తాము అర్థం చేసుకున్నామ‌ని తెలిపారు. అయితే మూడు పార్టీల నాయకత్వం ఫైనల్ చేసిన లిస్టు లోని వారికి మాత్రమే బీఫాంలు అందిస్తామ‌న్నారు. ``మేం బీఫాంలు ఎవరికి ఇస్తామో వారు మాత్రమే బరిలో నిలవం డి. మిగిలిన వారికి భవిష్యత్తులో అవకాశాలు ఇస్తాం. కూటమి స్ఫూర్తిని దెబ్బతీయవద్దు.`` అని ప‌వ‌న్ విన్న‌వించారు.

ప్ర‌స్తుత స్థానిక ఎన్నికల్లో సూక్ష్మస్థాయిలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభి వృద్ధికి, ప్రజా సంక్షేయానికి కూటమి ఎల్లపుడూ కృషి చేస్తుందని, ప్రజలంతా అండగా ఉండాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల్లో ఐక్యంగా కూటమి పార్టీలు ముందుకు వెళ్తున్నాయని చెప్పారు. టీడీపీ, బీజేపీ, జనసేన సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయానికి వచ్చామ‌న్న ప‌వ‌న్‌.. ఆ దిశగానే క్షేత్ర స్థాయిలోనూ అందరూ పని చేయాలన్నారు. చాలా మంది పోటీలో ఉన్నా.. రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని సీట్ల సర్దుబాటు జరిగిందని తెలిపారు.

సీఎం చంద్రబాబుతనకున్న సుదీర్ఘ అనుభవంతో సీట్ల సర్దుబాటు విషయంలో చాలా మంచి కసరత్తు చేశారని ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు. గ‌త రెండున్న‌రేళ్ల‌లో రాష్ట్రానికి 22 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు దీనివ‌ల్ల వేల మందికి ఉపాధి, ఉద్యోగాలు ల‌భించాయ‌న్నారు. అదేస‌మ‌యంలో స‌మాజంలో ప్ర‌మాద‌కరంగా మారిన‌ గంజాయిపై ఉక్కుపాదం మోపామ‌న్నారు. గ్రామస్వరాజ్యం దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆయా విష‌యాల‌ను ప్ర‌జ‌ల మ‌ధ్యకు తీసుకువెళ్లాల‌ని సూచించారు. 

Tags
Pawan kalyan's warning to janasena leaders
Recent Comments
Leave a Comment

Related News