వివేకా హ‌త్య కేసులో.. జ‌గ‌న్‌-భార‌తిల పేర్లు?

admin
Published by Admin — October 01, 2026 in Politics
News Image

వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి తాజాగా రెండు రోజుల నుంచి ఈ కేసులో ఏ2 నిందితుడుగా ఉన్న సునీల్ యాద‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు. వివేకాను దారుణంగా చంపించిన వారు ల‌బ్ధి పొందార‌ని.. ఈ హ‌త్య‌తో ల‌బ్ధి పొందిన వారు జ‌గ‌న్, ఆయ‌న స‌తీమ‌ణి భార‌తి, ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయ‌న తండ్రి భాస్క‌ర‌రెడ్డి, మ‌రో నేత శివ‌శంక‌ర్‌రెడ్డి మాత్ర‌మేన‌ని చెప్పుకొచ్చారు. వీరిపై కేసులు పెట్టి విచారించాల‌ని అన్నారు. అయితే.. వీరిలో జ‌గ‌న్‌, భార‌తిలు త‌ప్ప‌.. మిగిలిన వారిని సీబీఐ, ఈడీ అధికారులు విచారించారు.

ఈ నేప‌థ్యంలో వివేకా హత్య కేసులో జ‌గ‌న్‌, భార‌తిలే మిగిలారు. ఇప్పుడు వీరిపాత్ర‌ను తేల్చాల‌న్న‌ది సునీల్ యాద వ్ చేస్తున్న డిమాండ్. అందుకే వారిపై కేసులు న‌మోదు చేయాల‌ని ఆయ‌న కోరుతున్నారు. అప్పుడే వాస్త‌వాలు వెలుగు చూస్తాయ‌ని అంటున్నారు. అయితే.. ఈ కేసు విష‌యంపై ఇప్ప‌టికే గ‌తంలో వివేకా కుమార్తె సునీత స్పం దించారు. ఈ దారుణ హ‌త్య‌వెనుక జ‌గ‌న్ ఉన్నార‌ని తాను న‌మ్మ‌డం లేద‌ని.. అన‌డ‌మూ లేద‌ని అన్నారు. అయితే.. అస‌లు వివేకా మృతి స‌మాచారం ముందుగా ఆయ‌న‌కు ఎలా చేరింద‌న్న‌దే త‌న‌కు సందేహ‌మ‌ని చెప్పారు.

తెలంగాణ‌ హైకోర్టుకు ఈ ఏడాది ప్రారంభంలో స‌మ‌ర్పించిన అఫిడ‌విట్‌లో కూడా.. సునీత ఇదే విష‌యాన్ని చెప్పా రు. జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో ఉండ‌గా స‌రిగా స్పందించ‌లేద‌ని ఆరోపించారు. ఇక‌, భార‌తి విష‌యాన్ని సునీత ఎప్పుడూ బ‌య‌ట‌కు చెప్ప‌లేదు. ఈ కేసులో భార‌తి ప్ర‌మేయం ఉంద‌ని కానీ... ఆమెకు కూడా తెలుసున‌ని కానీ.. ఆమె ఎప్పుడూ చెప్ప‌లేదు. సో.. ఈ విష‌యంలో అంటే.. సునీల్ యాద‌వ్ చెబుతున్న విష‌యంలో అస‌లు బాధితురాలు.. కేవ‌లం తొలి పోన్ జ‌గ‌న్‌కు ఎలా వెళ్లింద‌న్న విష‌యాన్ని మాత్ర‌మే కోరుతున్నారు.

ఇప్పుడైనా చేస్తారా?

ఇక‌, ఇప్పుడు సునీల్ యాద‌వ్ ప‌దే ప‌దే చెబుతున్నందున జ‌గ‌న్‌, ఆయ‌న స‌తీమ‌ణి భార‌తిపై కేసులు న‌మోదు చేసే అవ‌కాశం ఉందా? అనేది రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున జ‌రుగుతున్న చ‌ర్చ‌. అయితే.. దీనిపై క్లారిటీ లేదు. ఎందుకంటే .. సీబీఐ త‌న ప‌రిధిలో ఇప్ప‌టికే విచార‌ణ‌ను ముగించింది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న 40 కోట్ల రూపాయల సుపారీ చుట్టూనే తిరుగుతున్న విచార‌ణ‌. దీనిలో క‌నుక జ‌గ‌న్‌కానీ, భార‌తి ప్ర‌మేయం కానీ ఉంద‌ని తేలితే.. అప్పుడు కేసులు న‌మోదు చేసే అవ‌కాశం ఉండొచ్చ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇక‌, ప్ర‌స్తుతం 40 కోట్ల సుపారీ విష‌యంపై సునీత స్పందించాల్సి ఉంది. అలాగే సునీల్ ప్ర‌క‌ట‌న‌ల‌పైనా ఆమె స్పందించాల్సి  ఉంది.

Tags
Viveka murder case jagan bharathi
Recent Comments
Leave a Comment

Related News