దానం నాగేందర్ పై అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక కోసం గెజిట్ కూడా జారీ అయింది. అయితే 2024లో దానం ఎన్నికల సంఘానికి సబ్మిట్ చేసిన అఫిడవిట్లో తప్పులు ఉన్నాయని అప్పటి ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ నేత విజయ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణ ఇంకా పూర్తి కాలేదు. ఈ నేపద్యంలోనే ఆ పిటిషన్ పై విచారణ పూర్తయిన తర్వాతే ఖైరతాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆమె కోరారు.
ఈ నేపథ్యంలోనే ఇదే విషయాన్ని తెలంగాణ హైకోర్టుకు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఆ పిటిషన్ పై విచారణ పూర్తయిన తర్వాతే ఆ ఉపఎన్నిక నిర్వహించగలమని హైకోర్టుకు తెలిపింది. మరోవైపు, తెలంగాణలో ఎస్ ఐ ఆర్ ప్రక్రియపై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిమాయత్ నగర్ పరిధిలో 20వేల ఓట్లు తొలగించారని సంచలన ఆరోపణలు చేశారు. ఓట్ల తొలగింపు విషయంలో ఎన్నికల సంఘం తన వైఖరిని మార్చుకోకుంటే ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ తో పాటుగా హైదరాబాద్ నగరాన్ని తగలబెట్టేస్తానని దానం నాగేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.