బొత్స కంచుకోట బద్దలైందిగా!

admin
Published by Admin — September 28, 2026 in Politics
News Image
ఉత్త‌రాంధ్ర జిల్లాల్లోని నియోజ‌క‌వ‌ర్గాల్లో చీపురుప‌ల్లికి ప్ర‌త్యేక స్థానం ఉంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు కంచుకోట‌. అలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు వైసీపీ చేతులు ఎత్తేసే ప‌రిస్థితి వ‌చ్చింది. తాజాగా మండ‌ల‌స్థాయి నాయ‌కుల నుంచి నియోజ‌క‌వ‌ర్గ స్థాయి నాయ‌కుల వ‌ర‌కు కూడా వైసీపీకి రాం రాం చెప్పేశా రు. ఇక త‌మ ప‌య‌నం.. సైకిల్‌పైనేన‌ని తేల్చేశారు. దీంతో చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ దాదాపు తుడిచి పెట్టుకుపోయింద‌న్న టాక్ వినిపిస్తోంది.
 
అనూష ఎంట్రీతో..
 
బొత్స స‌త్య‌నారాయ‌ణ త‌న కుమార్తె అనూష‌ను వార‌సురాలిగా ప్ర‌క‌టించారు. దీంతో ఆమె ఇటీవ‌ల ప‌గ్గాలు కూడా చేప‌ట్టారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌నే పోటీ చేస్తాన‌ని కూడా అన్నారు. అయితే.. దీనిపై స్థానిక వైసీపీ నాయ‌క‌త్వాన్ని బొత్స సంప్ర‌దించ‌కుండానే ప్ర‌క‌ట‌న చేయ‌డంతో వారంతా భ‌గ్గుమ‌న్నారు. దీంతో ఇటీవ‌ల‌.. క్షేత్ర‌స్థాయి నాయ‌కు ల‌ను బుజ్జ‌గించేందుకు బొత్స ప్ర‌య‌త్నాలు చేశారు. నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో స‌మావేశాలు పెట్టి.. క‌న్నీరు కూడాపెట్టుకున్నారు. కానీ.. అవేవీ ఫ‌లించిన‌ట్టు క‌నిపించ‌లేదు.
 
ఈ ప‌రిణామాల‌పై బొత్స అంత‌ర్గ‌త మంతనాలు సాగిస్తున్న స‌మ‌యంలోనే అనూహ్యంగా ఆదివారం 100కుపైగా క్షేత్ర‌స్థాయి వైసీపీనాయ‌కులు పార్టీకి రిజైన్ చేస్తూ.. బ‌య‌ట‌కు వ‌చ్చారు. తాము వైసీపీలో ఇమ‌డ‌లేమ‌ని నాయ‌కులు వెల్ల‌డించారు. త‌మ‌కు మ‌జ్జి శ్రీనివాస‌రావు అవ‌స‌ర‌మ‌ని.. ఆయ‌న వెంట‌నే న‌డుస్తామ‌ని చెప్పారు. బొత్స మేన‌ల్లుడు అయిన‌.. మ‌చ్చి శ్రీనివాస‌రావు.. ఇటీవ‌ల టీడీపీ కండువా క‌ప్పుకొన్నారు. దీంతో ఆయ‌న ప్ర‌భావం ప‌డుతుంద‌ని ముందుగానే అంచ‌నా వేసుకున్న బొత్స త‌న వ‌ర్గాన్ని కాపాడుకునే ప్ర‌య‌త్నం చేశారు.
 
అయిన‌ప్ప‌టికీ.. బొత్స వ‌ర్గం బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. వైసీపీకి గుండుగుత్త‌గా రాజీనామాలు స‌మ‌ర్పించారు. కాగా.. వీరు త్వ‌ర‌లోనే టీడీపీలో చేర‌నున్నారు.ఇక‌, చీపురుప‌ల్లిలో టీడీపీ ఇప్ప‌టికే పాగా వేయ‌గా.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌రింత బ‌లం పుంజుకునే అవ‌కాశం ఉంద‌న్న‌ది స్ప‌ష్టంగా తెలుస్తోంది. మ‌రోవైపు.. బొత్స వ‌ర్గం బ‌ల‌హీన ప‌డ‌డం.. అనూష‌కు మ‌ద్ద‌తు కొర‌వ‌డడంతో వైసీపీ ఇక్క‌డ ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతుంద‌న్న‌ది చూడాలి.
Tags
ycp Botsa Satyanarayana cheepurupalli
Recent Comments
Leave a Comment

Related News