తోడేలు ఎవరో అందరికీ తెలుసు జగన్!

admin
Published by Admin — November 10, 2026 in Politics
News Image

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబుపై త‌న అక్క‌సు వెళ్ల‌గ‌క్కార‌ని అంటున్నారు టీడీపీ నాయ‌కులు. తాజాగాసీఎం చంద్ర‌బాబు సోమ‌వారం మీడియా ముందుకు వ‌చ్చారు. ప్ర‌స్తుతం జ‌రిగిన స్థానిక‌, ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో కూట‌మి ఏ విధంగా విజ‌యం ద‌క్కించుకున్న‌దో వివ‌రించారు. అదేస‌మ‌యంలో వైసీపీపైనా ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. రాజ‌కీయాల్లో ఇవ‌న్నీ స‌హ‌జమే అయితే.. చంద్ర‌బాబుపై కోపం ఒక‌వైపు.. స్థానిక‌, మండ‌ల‌, జిల్లా ప‌రిష‌త్‌ల‌లో వైసీపీ భారీ ఓట‌మి చ‌విచూసింద‌న్న ఆవేద‌న మ‌రోవైపు.. జ‌గ‌న్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయ‌ని అంటున్నారు టీడీపీ నాయ‌కులు.

ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబుపై జ‌గ‌న్ నోరు చేసుకున్నార‌ని నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా జ‌గ‌న్ చేసిన ట్వీట్ సంచ‌ల‌నంగా మారింది. చంద్ర‌బాబుపై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. `రిగ్గింగ్ మాస్టర్ చంద్రబాబు` అంటూ.. హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేసిన జగన్.. `గొర్రెతోలు కప్పుకున్న తోడేలు, చంద్రబాబు ఒకటే` అని వ్యాఖ్యానించారు. అంతేకాదు. `రిగ్గింగ్ మాస్టర్` ఈరోజు ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్తుంటే ప్రజలు నివ్వెరపోతున్నారు. హే రామ్ సేవ్ ఆంధ్రా..!!`` అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పిస్తు న్నారు. చంద్ర‌బాబుచెప్పిన దాంట్లో త‌ప్పేముంది? అని ప్ర‌శ్నించారు.

అంతేకాదు.. ఏమైనా త‌ప్పులు చెప్పి ఉంటే.. జ‌గ‌న్ కూడా మీడియా ముందుకు వ‌చ్చి త‌న వాద‌న వినిపిస్తే బాగుండేద‌ని.. అప్పుడు ఎవ‌రు గొర్రెలో.. ఎవ‌రు తోడేళ్లో తెలిసేద‌ని సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి ఒక‌రు వ్యాఖ్యానించారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ``బాబాయిని సొంత ఇంట్లోనే గొడ్డ‌లితో న‌రికి చంపించి.. త‌ర్వాత దానిని గుండెపోటుగా అభివ‌ర్ణించిన వారు తోడేళ్లా? క‌దా? `` అని ప్ర‌శ్నించారు. సొంత త‌ల్లిని పార్టీ నుంచి గెంటేసి.. సొంత చెల్లికి ఆస్తిలో భాగం ఇవ్వ‌కుండా ఉసురు పెడ్డుతున్న‌వారు తోడేళ్లా.. గుంట‌న‌క్క లా? అని వ్యాఖ్యానించారు. ఒక్క‌ఛాన్స్ పేరుతో అధికారంంలోకి వ‌చ్చి ప్ర‌జ‌ల ఆస్తుల‌ను కొట్టేయాల‌ని ప‌న్నాగం ప‌న్నిన వారు.. తోడేళ్లా కాదా? అని ప్ర‌శ్నించారు.

ఇప్పుడు ప్ర‌జ‌లు మ‌రోసారి చాచి దెబ్బ కొడితే ఎవ‌రికి చెప్పుకోవాలో కూడా తెలియ‌క‌.. జ‌గ‌న్ మ‌తిభ్ర‌మించి మాట్లాడుతున్నార‌ని వ్యాఖ్యా నించారు. గ‌త 2024 ఎన్నిక‌ల కంటే కూడా ఇప్పుడు మ‌రింత‌గా ఓటు బ్యాంకు క‌ల్లాస్ అయిపోయింద‌ని.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం, జిల్లాలో కూడా అడ్ర‌స్ లేకుండా పోవ‌డంతో ఆయ‌న‌కు ఏం మాట్లాడాలో కూడా తెలియ‌డం లేద‌ని ఎద్దేవా చేశారు. రేపో మాపో మూసేసే పార్టీ ఏదైనా ఉంటే అది వైసీపీనేన‌ని అన్నారు. చంద్ర‌బాబును జైల్లో పెట్టి వికృతానందం పొందార‌ని.. ప్ర‌జ‌లు ఇచ్చిన షాక్ నుంచి ఇంకా తేరుకోలేన‌ట్టుగా ఉంద‌ని అన్నారు. 

Tags
Jagan wolf people
Recent Comments
Leave a Comment

Related News