ఓటీటీ ట్రెండ్ ఫాలో అవుతున్న చిరు!

admin
Published by Admin — September 28, 2026 in Movies
News Image
ఒక దశంలో టాలీవుడ్ కు నాలుగు స్తంభాలుగా ఉన్న చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణలు ఇప్పడు సీనియర్ హీరోలుగా కూడా దుమ్మురేపుతున్నారు. వీరిలో చిరంజీవి మినహా మిగతా ముగ్గురూ ఇప్పటికీ ఇటు సినిమాలతోపాటు అటు ఓటీటీలో కూడా తమదైన ముద్ర వేశారు. ఇక, మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు ఓటీటీ ఎంట్రీ ఇస్తారు అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి కోరిక తీరుస్తూ చిరంజీవి ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఓటీటీ జైంట్ నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి చిరు ఒక స్పెషల్ పాడ్‌కాస్ట్ సిరీస్ చేయబోతున్నారు.

వాస్తవానికి చిరు బయోగ్రఫీని ఒక డాక్యుమెంటరీగా చేయాలని నెట్ ఫ్లిక్స్ భావించింది. అయితే, పాడ్‌కాస్ట్ ద్వారా తన భావాలను మరింత స్వేచ్ఛగా, నేరుగా పంచుకోవచ్చని చిరు అనుకున్నారట. అందుకే, కుమార్తె, నిర్మాత సుస్మిత కొణిదెలతో పాటు ప్రముఖ రచయిత బీవీఎస్ రవి పాడ్ కాస్ట్ కు ప్రతిపాదించగా చిరు ఓకే చెప్పారట. ఆల్రెడీ పలు టాక్ షోలకు పనిచేసిన అనుభవం బీవీఎస్ రవికి ఉంది. అందుకే, చిరు ఓటీటీ అరంగేట్రం కూడా ఆయన చేతుల మీదుగానే జరగనుంది. ఈ ప్రాజెక్టుకు రచన, రూపకల్పన రవి చూస్తున్నారు. గతంలో ఎక్కడా పంచుకోని విషయాలను చిరంజీవి అభిమానులతో ఈ పాడ్ కాస్ట్ లో పంచుకోబోతున్నారట. ఈ పాడ్ కాస్ట్ గురించి నెట్‌ఫ్లిక్స్ త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయనుంది.
Tags
Megastar Chanjeevi podcast Netflix first time
Recent Comments
Leave a Comment

Related News