గ్రాండ్‌గా సాయి తేజ్ ఎంగేజ్మెంట్.. అమ్మాయి ఎవ‌రంటే.?

admin
Published by Admin — November 06, 2026 in Movies
News Image

టాలీవుడ్ మెగా కాంపౌండ్ నుంచి మరో హీరో పెళ్లిపీటలెక్కి కొత్త జీవితంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. 'సుప్రీమ్ స్టార్' సాయి దుర్గా తేజ్ (Sai Dharam Tej) త్వరలోనే ఓ ఇంటివారు కాబోతున్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ హిల్టన్ హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ రిసార్ట్ వేదికగా నవంబర్ 5న గురువారం నాడు ఆయన నిశ్చితార్థ వేడుక అత్యంత వైభవంగా జరిగింది.

అమ్మాయి ఎవరంటే..?
సాయి దుర్గా తేజ్ తన జీవితంలోకి రాబోతున్న కొత్త అర్ధాంగిని చాలా స్పెషల్‌గా ఎంచుకున్నారు. ఎవరో పరిచయం లేని వ్యక్తి కాకుండా.. తనకు ఎప్పటి నుంచో పరిచయమున్న తన చిన్ననాటి స్నేహితురాలు కిరణ్మయి(Kiranmayi)ని ఆయన వివాహం చేసుకోబోతున్నారు. స్నేహంగా ప్రారంభమైన వీరి బంధం ఇప్పుడు ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలెక్కింది.

ఈ నిశ్చితార్థ వేడుకను చాలా ప్రైవేట్‌గా, కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే నిర్వహించారు. అయితే, మెగా కాంపౌండ్ నుంచి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్ తదితరులు హాజరై ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా మెగా హీరోలందరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ఒక అందమైన గ్రూప్ ఫోటోను రామ్ చరణ్(Ram Charan) తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఎంగేజ్ మెంట్ ముగియడంతో ఇక పెళ్లి(Mega Wedding) తేదీపై కూడా క్లారిటీ వచ్చేసింది. సాయి తేజ్, కిరణ్మయిల వివాహం డిసెంబర్ 10, 2026న హైదరాబాద్‌ వేదికగా అత్యంత అంగరంగ వైభవంగా జరగనుంది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న సాయి తేజ్‌కు అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Tags
Sai Dharam Tej Sai Durga Tej Kiranmayi Mega Family Tollywood Mega Wedding Ram Charan Allu Arjun
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News