ప్యారడైజ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ అదుర్స్‌.. అసలు సవాల్ ఇప్పుడే!

admin
Published by Admin — September 28, 2026 in Movies
News Image

నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'ది ప్యారడైజ్(The Paradise)' బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. ప్రీమియర్లతో మొదలైన ఈ సినిమా ప్రయాణం, ఎలాంటి అడ్డంకులు లేకుండా విజయవంతంగా మొదటి వీకెండ్‌ను పూర్తి చేసుకుంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 140 నుంచి 150 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నప్పటికీ, వసూళ్ల సునామీ మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

సినిమా టాక్‌తో సంబంధం లేకుండా మెయిన్ సెంటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు పడటం విశేషం. ముఖ్యంగా నైజాం ప్రాంతం నుంచి సినిమాకు ఊహించని స్థాయిలో మద్దతు లభిస్తోంది. హైదరాబాద్‌తో పాటు పలు ప్రధాన నగరాల్లో టికెట్ల కోసం ప్రేక్షకులు ఎగబడుతున్నారు. బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం వేరే గట్టి పోటీ లేకపోవడం, వీకెండ్‌లో జనాలు చూసేందుకు వేరే ఆప్షన్స్ లేకపోవడం ప్యారడైజ్‌కు చాలా ప్లస్ అయింది. అయితే, కేవలం సోలో రిలీజ్ బెనిఫిట్ మాత్రమే కాకుండా, నాని(Nani)పై ప్రేక్షకులకు ఉన్న నమ్మకం, ఆయన జానర్ సెలక్షన్ ఈ రేంజ్ కలెక్షన్లను రాబట్టేలా చేశాయి. ఓవర్సీస్‌లోనూ దూసుకుపోతున్న ఈ చిత్రం, యూఎస్‌లో ఇప్పటికే రెండు మిలియన్ డాలర్ల మైలురాయిని దాటేసి రికార్డుల వైపు అడుగులు వేస్తోంది.

కలెక్షన్ల పరంగా తొలి వారం అద్భుతంగా ఉన్నప్పటికీ, అసలైన అగ్నిపరీక్ష ఇకపైనే ప్రారంభం కానుంది. సోమవారం నుంచి వీక్‌డేస్ మొదలుకావడంతో ఆక్యుపెన్సీలు ఎంతవరకు నిలకడగా ఉంటాయనేది సినిమా భవిష్యత్తును నిర్ణయించనుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మార్కెట్‌లో వసూళ్లు కొద్దిగా డల్లుగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. సోమవారం నుంచి ఈ డ్రాప్స్ ఏ స్థాయిలో ఉంటాయనే దానిపైనే సినిమా సూపర్ హిట్ స్టేటస్ ఆధారపడి ఉంటుంది. ఒకవేళ వర్కింగ్ డేస్‌లోనూ డ్రాప్స్ తక్కువగా ఉంటే మాత్రం ప్యారడైజ్(The Paradise) బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయం. మరి ఈ అసలు సవాల్‌ను నాని టీమ్ ఎలా ఎదుర్కొంటుంది? వీక్‌డేస్‌లోనూ ఈ జోరు కొనసాగుతుందా? వేచి చూడాలి.

Tags
The Paradise The Paradise Collections Nani Tollywood Telugu Movies Srikanth Odela Telugu Cinema
Recent Comments
Leave a Comment

Related News