ప్రశ్న రావణ్ పేరుతో యూట్యూబ్ ఛానెల్ పెట్టుకుని.. ఏపీలోని కూటమి సర్కారు సహా.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై దుమ్మెత్తి పోసిన బచ్చలికూరి జోసెఫ్ వెనుక ఎవరున్నారు? ఎంత మొత్తం సాయం చేశారు? దీనికి కారణం ఏంటనే విషయాలను పోలీసులు రాబట్టినట్టు తెలిసింది. ఆరు రోజుల పాటు కస్టడీకి తీసుకున్న పోలీసు లు.. విజయవాడ శివారు గన్నవరంలో ఆయనను విచారించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలకు సమాధా నం చెప్పగా.. మరికొన్నింటిని దాటవేసినట్టు పోలీసులు తెలిపారు.
ప్రాథమికంగా.. జోసెఫ్ ఓయూట్యబర్ . కానీ, ఎప్పుడైతే.. ప్రశ్నించడం మొదలు పెట్టి.. పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసుకున్నాడో.. అప్పటి నుంచి వైసీపీ అతనిని అక్కున చేర్చుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో వైసీపీకి చెందిన ఇంద్రసేన నాయుడు.. ఆధ్వర్యంలో రావణ్‌ను పెంచి పోషిస్తూ వచ్చారు. నెల నెలా సొమ్ములు ఇవ్వడంతోపాటు.. విమాన ప్రయాణాలు సహా.. ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేలా ఏర్పాటు చేయడం వరకు కూడా వైసీపీ కనుసన్నల్లోనే జరిగినట్టు గుర్తించారు.
ముఖ్యంగా వైసీపీకి చెందిన నాయకుల ఖాతాల నుంచి రావణ్‌కు 25 లక్షల రూపాయల వరకు సొమ్ములు విడతల వారీగా చేరిందని.. ఇదంతా విదేశీ ఖాతాల నుంచి వచ్చిన సొమ్మేనని అధికారులు గుర్తించారు. అయితే.. వారెవరు అనే విషయాన్ని జోసెఫ్ చెప్పలేదని తెలిసింది. ఇక, నిషేధిత మావోయిస్టు భావజాలానికి రావణ్ ఆకర్షితుడు అయ్యాడని, దీంతో అటవీ బాట పట్టి.. ఇంటర్వ్యూలు. సమాచార సేకరణ పేరుతో మావోయిస్టులకు మద్దతుగా నిలిచినట్టు కూడా గుర్తించారు. పలువురు మాజీ మావోయిస్టులతోనూ రావణ్‌కు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని గుర్తించారు.
మొత్తంగా రావణ్ కస్టడీ ముగిసింది. ఈ క్రమంలో ఆయన అందించిన సమాచారం మేరకు.. హైదరాబాద్ సభా పలు జిల్లాల్లో తనిఖీలు చేపట్టనున్నారు. అలానే ఇంద్రసేన నాయుడు సహా పలువురు వైసీపీ నాయకులను కూడా అరెస్టు చేసి విచారించనున్నట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో తెరవెనుక రావణ్‌ను ప్రోత్సహించింది. వైసీపీనే నని పోలీసులు నిర్ధారిస్తున్నారు. అయితే.. అతనికి తమకు ఎలాంటి సంబంధం లేదని గతంలో వైసీపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించడం గమనార్హం.