భర్తలు అంట్లు తోమితే తప్పేంటి?

admin
Published by Admin — September 26, 2026 in National
News Image
భార్య‌ల‌కు బాస‌ట‌గా భ‌ర్త‌లు ఇంట్లో ప‌నులు చేయ‌డం త‌ప్పుకాద‌ని.. ముఖ్యంగా ఇల్లు ఊడ‌వ‌డం, అంట్లుతోమ‌డం వంటి ప‌నుల‌ను పంచుకో వ‌చ్చ‌ని దీనివ‌ల్ల హోదాకు భంగం క‌ల‌గ‌ద‌ని మ‌ద్రాస్ హైకోర్టు పేర్కొంది. పైగా.. ప్ర‌స్తుతం మ‌హిళ‌లు చాలా మంది వివాహానికి దూరంగా ఉండ‌డానికి కార‌ణం ఇంట్లో ప‌నులేన‌ని వ్యాఖ్యానించింది. గృహిణి అంటే.. ఇంట్లో ప‌నులు చేయ‌డ‌మ‌న్న అర్థంలోనే వాడుతున్నార‌ని.. వారు తెల్లారి లేచిన ద‌గ్గ‌ర నుంచి అంట్లు తోముడూ.. ఇల్లు ఊడుస్తూ.. బ‌ట్ట‌లు ఉతుకుతూ.. జీవితాన్ని త్యాగం చేస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించిం ది. అందుకే పెళ్లిళ్లు చేసుకునేందుకు మెజారిటీ మ‌హిళ‌లు ముందుకు రావ‌డం లేద‌న్నారు.
 
ఈ ప‌రిస్థితి మారాలి..
 
ఈ ప‌రిస్థితి మారాలంటే.. మ‌గ‌వారు గృహ‌స్థులుగా మారాల‌ని హైకోర్టు సూచించింది. కేవ‌లం మ‌హిళ‌ల‌ను వంటింటి కుందేళ్లుగా చూసే సంస్కృతి మారాల‌ని పేర్కొంది. మ‌హిళ‌లు చేసే ప‌నికి వెల‌క‌ట్ట‌లేమ‌ని పేర్కొన్న మ‌ద్రాస్ హైకోర్టు ధ‌ర్మాస‌నం.. ప‌నిలో మ‌గ‌వాళ్లు చేయి క‌లిపితేనే బంధాలు బ‌ల‌ప‌డ‌తాయ‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల విడాకుల కేసులు పెరిగిపోవ‌డానికి కూడా కుటుంబంలో చోటు చేసుకుంటున్న ప‌ని సంస్కృతే కార‌ణ‌మ‌ని తెలిపింది. దీనిని అరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వాలు, న్యాయ‌స్తానాల జోక్యం కంటే.. పురుషుల జోక్య‌మే ముఖ్య‌మని అభిప్రాయ‌ప‌డింది. ఇంట్లో ప‌ని చేసినంత మాత్రాన డిగ్రీకి, హోదాకు ఎలాంటి భంగం వాటిల్ల‌ద‌ని తేల్చి చెప్పింది.
 
పురుషుల‌ది కేవ‌లం కుటుంబ ఆర్థిక బాధ్య‌త మాత్ర‌మే కాద‌ని హైకోర్టు పేర్కొంది. గృహిణి అనే ప‌దాన్ని ప‌లికేందుకు మ‌హిళ‌లు ఇప్పుడు ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని పేర్కొంది. ఒక‌ప్పుడు గృహిణి అంటే ఎంతో సంతోషించేవార‌ని, కానీ, గ‌త రెండు ద‌శాబ్దాలుగా స‌మాజంలో మారుతున్న ప‌రిణామాల‌ను అంచ‌నా వేస్తే.. గృహిణులుగానే మ‌హిళ‌లు ఉండిపోయేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని..వారు కూడా ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నార‌ని.. త‌ద్వారా స‌మాజంలోపురుషుల‌తో స‌మానంగా ఆర్థిక కార్య‌కలాపాలు నిర్వ‌హిస్తున్నార‌ని స్ప‌ష్టం చేసింది. ఈ నేప‌థ్యంలో పురుషులు ఇంట్లో ప‌నులు చేయ‌డం ద్వారా.. మ‌హిళ‌ల‌కు స్వాంత‌న క‌లిగిస్తే.. కుటుంబ బంధాలు మెరుగ‌వుతాయ‌ని పేర్కొంది.
 
ఏంటి కేసు?
 
త‌మిళ‌నాడుకు చెందిన భార్యా భ‌ర్త‌లు వైద్యుల‌. భార్య దంత వైద్యురాలు. భ‌ర్త కార్డియాల‌జిస్ట్‌. కొన్నాళ్ల కింద‌ట భ‌ర్త‌కు కార్డియాల‌జీ విభాగంలో అవార్డు ల‌భించింది. దీంతో భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య వివాదం రాజుకుంది. కుటుంబ బాధ్య‌త‌లు, ఇంట్లో పనుల‌ను తాను ఒక్క‌దాన్నే నిర్వ‌హిస్తున్నందున వృత్తిలో పైకి రాలేక‌పోయాన‌ని ఆమె వాదిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇరువురు విడిపోవాల‌ని నిర్ణ‌యించుకుని కోర్టును ఆశ్ర‌యించారు. కానీ, వారికి విడాకులు మంజూరు కాక‌పోవ‌డంతో హైకోర్టును ఆశ్ర‌యించారు. ఇక్క‌డ కూడా వారికి విడాకులు రాలేదు. కానీ, భ‌ర్త ఇంట్లో ప‌నులు పంచుకుంటే.. ఈ వివాదం స‌మ‌సిపోతుంద‌ని.. అప్పుడు ఆమె వృత్తిలో రాణిస్తార‌ని కోర్టు తేల్చి చెప్పింది. 
Tags
madras high court dishes husband doing dishes wife husband
Recent Comments
Leave a Comment

Related News