పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్.. కూటమిలో కొత్త హీట్.!

admin
Published by Admin — September 24, 2026 in Politics, Andhra
News Image

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా స్థానిక సంస్థల మోత మోగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కూటమికి.. ఇప్పుడు రాబోయే స్థానిక సమరం అసలైన అగ్నిపరీక్షగా మారనుంది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు, పార్టీ మూలాలను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ వేస్తున్న అడుగులు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

కూటమి ఐక్యతకు ఎట్టి పరిస్థితుల్లోనూ విఘాతం కలగకూడదని స్పష్టం చేస్తూనే.. జనసేనకు తగిన గౌరవం, సముచిత స్థానం దక్కాల్సిందేనని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) స్పష్టం చేయడం ఆసక్తికరంగా మారింది. బలమైన ప్రాంతాల్లో తమ పార్టీ అభ్యర్థులనే బరిలో దింపుతామని ఆయన తేల్చి చెప్పడం వెనుక ఒక పక్కా వ్యూహం ఉందన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే, గతంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం అనేక త్యాగాలు చేసిన జనసేన.. ఇప్పుడు మాత్రం తన పొలిటికల్ స్పేస్‌ను, కేడర్ మనోధైర్యాన్ని పెంచుకోవడంలో ఎలాంటి రాజీ పడేలా లేదు.

అయితే, పవన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు టీడీపీ, జనసేన(Janasena), బీజేపీ క్యాడర్‌లో ఒక్కసారిగా హీట్ పెంచింది. ఎవరికి వారు స్థానిక పీఠాలపై కన్నేసి సిట్టింగ్ స్థానాలు, బలమైన నియోజకవర్గాలపై ఎన్డీఏ కూటమిలోనూ లెక్కలు వేసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అంత తేలికైన విషయం కాకపోవడంతో.. ఈ మినీ పోరు కూటమి నేతలకు పెద్ద సవాలుగానే మారనుంది. ఏకపక్ష నిర్ణయాలకు తావులేకుండా, కూటమి సమన్వయాన్ని దెబ్బతీయకుండా ఈ సీట్ల పంచాయతీని నేతలు ఎలా పరిష్కరించుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఈ స్థానిక యుద్ధంలో కూటమి పార్టీలు సఖ్యతతో ముందుకు సాగి విజయం సాధిస్తే.. ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం రెట్టింపు అవుతుందనడంలో సందేహం లేదు. సరిగ్గా ఇదే పాయింట్‌ను పట్టుకున్న పవన్ కళ్యాణ్.. పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూనే, ప్రత్యర్థులకు గట్టి వార్నింగ్ ఇస్తున్నారు. మొత్తానికి, పవన్ వేసిన ఈ వ్యూహాత్మక అడుగులు ఏపీ(AP) పాలిటిక్స్‌ను వేడెక్కిస్తుండ‌గా, రాబోయే స్థానిక పోరు రసవత్తరంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags
Pawan Kalyan Janasena TDP AP News AP Local Body Elections YSRCP NDA Alliance
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News