వైసీపీ హయాంలో నాటి ముఖ్యమంత్రి జగన్ తమకు అండగా ఉన్నాడన్న భరోసాతో ఆయన చెప్పినట్టు ఆడిన వారికి ప్రస్తుతం చట్టాలు... చుక్కులు చూపిస్తున్నాయి. ఒకరి తర్వాత.. ఒకరు కాదు.. గుండుగుత్తగా చాలా మంది నాడు జరిగిన లిక్కర్ స్కామ్లో చిక్కుకుని జైలు ఊచలు లెక్కిస్తున్నారు. కనీసం ముందస్తు బెయిల్ కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి వారిలో లిక్కస్ స్కామ్ సూత్రధారిగా ఉన్నారని భావిస్తున్న రాజ్ కసిరెడ్డి(కసిరెడ్డి రాజశేఖరరెడ్డి), నాటి అబ్కారీ శాఖ కమిషనర్గా పనిచేసిన వాసురెడ్డిలు ఉన్నారు.
వీరు గతంలోనే 12 నుంచి 13 నెలల పాటు జైలు జీవితం గడిపి బయటకు వచ్చారు. అయితే.. కొన్నాళ్ల కిందట.. వీరిని మద్యం కుభకోణం కేసులోనే.. నగదు లావాదేవీలకు సంబంధించి ఎన్ ఫోర్స్మెంటు డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరు ఆ కేసులో జైల్లో ఉన్నారు. అయితే.. వీరికి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని.. కోర్టును ఆశ్రయించగా.. ఏపీ హైకోర్టు ఇవ్వలేదు. ఈ కేసు తీవ్రత ఎక్కువగా ఉందని తేల్చి చెప్పింది.
దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టు.. కూడా వీరికి బెయిల్ ఇచ్చేందుకు అంగీకరిం చలేదు. పైగా.. ప్రజల రక్తాన్ని తాగేలా వ్యవహరించారంటూ.. ఈడీ తరఫున న్యాయవాది చేసిన వ్యాఖ్యలతో ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ``ఇది చాలా తీవ్రమైన కేసు. దీనిలో బెయిల్ ఇవ్వడం అంటే.. పెద్ద పొరపాటే`` అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్.. సూర్యకాంత్.. ఇతర న్యాయమూర్తులకు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో బెయిల్ ఇవ్వడం కుదదరని.. కేసును సీబీఐ, సిట్, ఈడీ అధికారులు ఏకకాలంలో విచారిస్తే.. తప్పేముందని ప్రశ్నించారు.
ఈడీ కస్టడీలో ఉన్నారని నిందితుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే జైలు జీవితం అనుభవించి వచ్చారని అన్నారు. అయితే.. శిక్ష పడలేదు కదా! అని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నిం చింది. ఈ కేసు తీవ్రత నేపథ్యంలో ఇప్పుడు బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. ఇదిలావుం టే... జగన్ను నమ్మినందుకు జైలు జీవితం అనుభవిస్తున్నారని.. ఒకరిద్దరు న్యాయవాదులు(ఏపీకి చెందిన) వ్యాఖ్యానించడం గమనార్హం.