ఓటీటీలోకి ర‌వితేజ బ్లాక్‌బ‌స్ట‌ర్ `ఇరుముడి`.!

admin
Published by Admin — September 13, 2026 in Movies
News Image

మ‌రపురాని భావోద్వేగాలు, సరికొత్త రికార్డులతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) తాజా చిత్రం `ఇరుముడి` ఇప్పుడు డిజిటల్ తెరపైకి వచ్చేందుకు ముహూర్తం ఖరారైంది. రొటీన్ మాస్ జోనర్లకు భిన్నంగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ ఎమోషనల్ డ్రామా, థియేటర్లలో ప్రేక్షకులను కంటతడి పెట్టించడంతో పాటు కాసుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. అయ్యప్ప దీక్ష నేపథ్యంతో తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌ను అద్భుతంగా మిళితం చేసిన ఈ చిత్రం ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్‌గా నిలిచింది.

సుమారు రూ. 40 బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 200 కోట్లకు పైగా గ్రాస్‌ను రాబట్టి ట్రేడ్ వర్గాలకే దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ముఖ్యంగా నైజాం బాక్సాఫీస్ వద్ద రవితేజ కెరీర్‌లోనే ఎన్నడూ లేనివిధంగా 53 కోట్ల పైచిలుకు షేర్ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. కుటుంబ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో ఇరుముడి(Irumudi) చిత్రం సులభంగానే వంద కోట్ల నిట్ ప్రాఫిట్ క్లబ్‌లో చేరింది.

సినిమా థియేట్రికల్ రన్ ముగింపు ద‌శ‌కు చేరుకోవ‌డంతో, ఈ విజువల్ అండ్ ఎమోషనల్ జర్నీని ఇంట్లోనే కూర్చుని చూసేందుకు ఓటీటీ ప్రియులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే ప్రముఖ డిజిటల్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్(Netflix) ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది. తెలుగుతో పాటు ఇతర దక్షిణ భారత భాషలు, హిందీలోనూ సెప్టెంబర్ 18 నుంచి ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతున్న‌ట్లు నెట్‌ఫ్లిక్స్ అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేసింది. సో.. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు, మరోసారి ఆ మ్యాజిక్‌ను ఫ్యామిలీతో కలిసి అనుభవించాలనుకునే వారు ఓటీటీలో ఇరుముడిని అస్స‌లు మిస్ అవ్వ‌కండి.

Tags
Irumudi Ravi Teja Shiva Nirvana Netflix Mass Maharaja Tollywood Telugu Cinema
Recent Comments
Leave a Comment

Related News