తోలు తీస్తాం..బోండా ఉమ డెడ్లీ వార్నింగ్

admin
Published by Admin — August 07, 2026 in Andhra
News Image
సీఎం చంద్రబాబు, లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించే ప్రసక్తే లేదని వైసీపీ నేతలకు టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమా డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ నేతల నిరాహార దీక్ష వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఆయన స్పందించారు. డీఎస్సి నిర్వహణలో అక్రమాలు అంటూ ఆరోపణలు చేయడం ఏంటని ఆయన మండిపడ్డారు. అసలు అక్రమాలపై చర్చకు రావాలని వైసిపి నేతలకు సవాల్ చేస్తే వారు పారిపోయారని ఎద్దేవా చేశారు.

పోలీసులు అనుమతి లేకుండా రోడ్డుపై నిరసన వ్యక్తం చేయడమే కాకుండా చంద్రబాబు, లోకేష్ లను వైసీపీ నేతలు బూతులు తిట్టారని, అటువంటి వారిని సహించే ప్రసక్తే లేదని అన్నారు. రోడ్డు మీద కూర్చుని టిడిపి నాయకులపై దాడి చేస్తామంటే చూస్తూ ఊరుకోమని, తోలు తీస్తామని హెచ్చరించారు. ఇక, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎక్కడ కనిపిస్తే అక్కడ కట్టేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
Tags
tdp mla bonda uma warning ycp leaders ex minister vellampalli srinivas
Recent Comments
Leave a Comment

Related News