ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టి రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే గడచిన రెండు సంవత్సరాలలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు ఇంటింటికి తెలుగుదేశం రెండేళ్లు నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమానికి టిడిపి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం 11వ రోజుకు చేరుకుంది. ఈ 11వ రోజున 3.40 లక్షల గృహాలను టిడిపి శ్రేణులు సందర్శించాయి. ఈ 11 రోజుల్లో ఇంత పెద్ద సంఖ్యలో ఇళ్లను సందర్శించడం ఇదే తొలిసారి.
ఇక, ఈ కార్యక్రమంలో ఉత్తమ పనితీరు కనబరుస్తున్న టీడీపీ నేతలకు, కార్యకర్తలకు లోకేష్ అభినందనలు తెలిపారు. ఇదే స్పూర్తితో మరింత ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పారు. టెక్నాలజీని ఉపయోగిస్తూ ఈ కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని లోకేష్ చెప్పారు.