టెంకాయ..గుమ్మడి కాయ మేమే కొట్టాం: చంద్రబాబు

admin
Published by Admin — August 01, 2026 in Andhra
News Image

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ విమానాశ్రయ పనుల ప్రారంభోత్సవానికి కొబ్బరికాయ..విమానాశ్రయ పనుల ముగింపు సందర్భంగా గుమ్మడికాయ..రెండూ కొట్టింది మనమే అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ఎయిర్ పోర్ట్ క్రెడిట్ కొట్టేయాలనుకుంటున్న జగన్ కు చంద్రబాబు ఈ రకంగా కౌంటర్ ఇచ్చారు.

కేంద్ర విమానయానశాఖ మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు హయాంలో ఈ ఎయిర్ పోర్ట్ నిర్మాణం మొదలైందని, దానిని ప్రస్తుత కేంద్ర విమానయాన శాఖా మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు కూడా ఉత్తరాంధ్ర వ్యక్తే అని..ఈ విమానాశ్రయం నిర్మించిన కట్టిన జీఎంఆర్ అధినేత మల్లిఖార్జునరావు కూడా ఉత్తరాంధ్రవాసే అని చంద్రబాబు అన్నారు. తమ భూములు ఇచ్చి ఈ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి సహకరించిన రైతులకు చంద్రబాబు పాదాభివందనం చేశారు.

వైసీపీ విద్వంసకర పాలనతో నాశనమైన రాష్ట్రానికి ప్రధాని మోదీ ఆక్సిజన్ ఇచ్చారని ప్రశంసించారు. ప్రధాని సహకారం వల్ల ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు పెట్టుబడులు రాబోతున్నాయని కొనియాడారు. ప్రధాని మోదీ అండతో 2028 నాటికి అమరావతి తొలి దశ పనులు పూర్తి చేసి ఆయన చేతుల మీదుగానే ప్రారంభిస్తామని అన్నారు.

Tags
started and finished ASRI Airport Bhogapuram airport ap cm chandrababu
Recent Comments
Leave a Comment

Related News