అక్కినేని అభిమానులు ముద్దుగా 'అయ్యగారు' అని పిలుచుకునే అఖిల్ అక్కినేని(Akhil Akkineni) గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత హీరోగా తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అఖిల్.. అసలు ఇండియన్ సిటిజన్ కాదట. అదేంటి, అక్కినేని ఫ్యామిలీలో పుట్టిన అఖిల్ ఇండియన్ కాకపోవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది అక్షరాలా నిజం.
ఇటీవల ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అఖిల్.. తన పౌరసత్వంపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. 1994 ఏప్రిల్ 8న అమెరికాలోని కాలిఫోర్నియాలో జన్మించిన అఖిల్ కు.. అక్కడి చట్టాల ప్రకారం పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం(US Citizen) లభించింది. అప్పటి నుంచి ఆయన వద్ద అమెరికా పాస్‌పోర్ట్ మాత్రమే ఉంది. చిన్నప్పటి నుంచి హైదరాబాద్ లోనే పెరిగి, ఆస్ట్రేలియా, న్యూయార్క్ లాంటి చోట్ల చదువులు పూర్తి చేసుకుని ఇక్కడే సెటిల్ అయినా.. టెక్నికల్ గా చూసుకుంటే ఆయన ఇంకా అమెరికన్ సిటిజనే.
అయితే, ఫ్యాన్స్ కంగారు పడాల్సిన పనిలేదు. త్వరలోనే అయ్యగారు పక్కా లోకల్ కాబోతున్నారు. ప్రస్తుతం తాను అమెరికా పౌరసత్వాన్ని వదులుకునే ప్రాసెస్ లో ఉన్నానని, ఇంకొన్ని నెలల్లోనే అధికారికంగా భారతీయ పౌరుడిగా మారబోతున్నానని అఖిల్ స్పష్టం చేశారు. చేతిలో ఏ దేశపు పాస్‌పోర్ట్ ఉన్నా, మనసులో మాత్రం తాను ఎప్పటికీ భారతీయుడినే అని చెబుతూ.. 'మేరా భారత్ మహాన్' అంటూ తన దేశభక్తిని చాటుకున్నారు. సో.. అతి త్వరలోనే అఖిల్ అఫీషియల్ గా మన ఇండియన్ కాబోతున్నాడన్నమాట. కాగా, ఇటీవల `లెనిన్(Lenin)` మూవీతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ ను ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్‌లో ఉన్న అఖిల్.. ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్స్ సెలక్షన్‌లో బిజీగా ఉన్నాడు.