అక్కినేని అఖిల్(Akhil Akkineni)కు ‘లెనిన్’ రూపంలో అద్భుతమైన మాస్ సక్సెస్‌ను అందించిన దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరి పేరు ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద తన మేకింగ్‌తో, విలేజ్ బ్యాక్‌డ్రాప్ కథను నడిపించిన తీరుతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ యంగ్ డైరెక్టర్.. తన రెండో సినిమాతోనే టాప్ లీగ్‌లోకి అడుగుపెట్టేశారు. ప్రస్తుతం ఈ సక్సెస్ మూడ్‌ను ఎంజాయ్ చేస్తున్న ఆయన, తన తదుపరి ప్రాజెక్ట్‌ను మరింత భారీగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
‘లెనిన్(Lenin)’ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ అధినేతలు, మురళి కిషోర్ మేకింగ్ పట్ల ఎంతో సంతృప్తిగా ఉన్నారట. ఈ క్రమంలోనే ఆయనకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు సమాచారం. కథపై ఉన్న నమ్మకంతో, తన తదుపరి చిత్రాన్ని కూడా తమ బ్యానర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు సితార సంస్థ ఆమోదం తెలిపినట్లు టాక్ నడుస్తోంది.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. మురళి కిషోర్(Murali Kishor Abburu) మళ్లీ తనకు అలవాటైన, బలమైన గ్రామీణ నేపథ్యాన్నే ఎంచుకున్నారట. గ్రామీణ వాతావరణం, ఆకట్టుకునే భావోద్వేగాలు, దానికి తోడు సరిపడా మాస్ ఎలిమెంట్స్‌తో ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ కథలో హీరోగా నటించేందుకు తమిళ స్టార్ హీరో ధనుష్‌ను సంప్రదించే ఆలోచనలో చిత్రబృందం ఉందట. కథలోని ఎమోషన్స్, హీరో క్యారెక్టరైజేషన్ ధనుష్ బాడీ లాంగ్వేజ్‌కు నూటికి నూరు శాతం సరిపోతాయని భావిస్తున్నారు.
ప్రస్తుతం ధనుష్(Dhanush) పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ, దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. స్క్రిప్ట్ పనులు పూర్తిగా పూర్తయ్యాక హీరో ఎంపికపై ఫైనల్ కాల్ తీసుకోనున్నారు. ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం, తెలుగు-తమిళ భాషల్లో ఒక పవర్‌ఫుల్ రూరల్ డ్రామాను ప్రేక్షకులు చూడటం ఖాయం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడటానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.