అది ఆగిపోవడమే అఖిల్‌కు వరమైందా?

admin
Published by Admin — July 16, 2026 in Movies
News Image

బిగ్‌బడ్జెట్ సినిమాలు, భారీ యాక్షన్ ఎపిసోడ్‌లు, పాన్ ఇండియా కలలు.. ఒక్కోసారి ఇవే హీరోల కెరీర్‌ను రిస్క్‌లో పడేస్తుంటాయి. సరిగ్గా ఇదే పరిస్థితి నుంచి తప్పించుకుని, ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాడు అక్కినేని అఖిల్(Akhil Akkineni). ప్రస్తుతం థియేటర్లలో 'లెనిన్' సృష్టిస్తున్న ప్రభంజనం చూస్తుంటే.. ఆ భారీ సినిమా ఆగిపోవడమే అఖిల్‌కు వరమైంది అనే మాట ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఇంతకీ ఆ ఆగిపోయిన ప్రాజెక్ట్ ఏంటి? అఖిల్ కెరీర్‌ను ఈ 'లెనిన్' ఎలా మలుపు తిప్పింది?

'ఏజెంట్(Agent)' లాంటి భారీ డిజాస్టర్ తర్వాత అఖిల్ తీవ్రమైన ఒత్తిడిలో పడిపోయాడు. ఆ సమయంలో ఎలాగైనా పెద్ద హిట్టు కొట్టాలనే కసితో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో 'ధీర' అనే ఒక భారీ ఫాంటసీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కొత్త దర్శకుడు అనిల్ డైరెక్షన్‌లో ప్లాన్ చేసిన ఈ సినిమా కోసం అఖిల్ జుట్టు పెంచి, లుక్ మొత్తం మార్చేసి చాలా రోజులు వెయిట్ చేశాడు. కానీ, యూవీ క్రియేషన్స్ అంతర్గత సమీకరణాలు, ఇతర పెద్ద సినిమాల ఆలస్యం వల్ల ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కకుండానే ఆగిపోయింది. ఒకానొక దశలో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడం అఖిల్‌ను తీవ్ర నిరాశకు గురిచేసిందనే చెప్పాలి.

కట్ చేస్తే.. అదే సమయంలో దర్శకుడు మురళికిషోర్ అబ్బూరు చెప్పిన క్లాస్ అండ్ విలేజ్ డ్రామా కథ అఖిల్‌ను ఆకర్షించింది. నాగార్జున కూడా సపోర్ట్ ఇచ్చి, అన్నపూర్ణ స్టూడియోస్ భాగస్వామ్యంతో రంగంలోకి దిగడంతో 'లెనిన్(Lenin)' ప్రాజెక్ట్ వేగంగా పూర్తయింది. నిజానికి ఆ ఫాంటసీ సినిమా ఆగిపోవడం వల్లే అఖిల్ ఈ కథపై దృష్టి పెట్టగలిగాడు. రిస్క్ లేని బడ్జెట్, నమ్మకమైన కథనం, ప్రేక్షకులను కనెక్ట్ చేసే విలేజ్ బ్యాక్‌డ్రాప్ వెరసి 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద సైలెంట్ విన్నర్‌గా నిలిచింది. టికెట్ రేట్లు కూడా అందుబాటులో ఉంచడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయింది.

ప్రస్తుతం థియేటర్లలో పెద్దగా పోటీ లేకపోవడంతో వీకెండ్‌లో 'లెనిన్' భారీ వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల బాట పట్టిన ఈ చిత్రం.. త్వరలోనే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరేందుకు అడుగులు వేస్తోంది. ఒకవేళ అఖిల్ ఆ భారీ ఫాంటసీ సినిమానే పట్టుకుని కూర్చుని ఉంటే, ఈపాటికి భారీ బడ్జెట్ ఒత్తిడితో సతమతమయ్యేవాడు. కానీ, 'లెనిన్' ఇచ్చిన సక్సెస్ అఖిల్‌ను మళ్లీ ట్రాక్‌లోకి తెచ్చింది. ఇప్పుడు ఇదే ఊపుతో దర్శకుడు మురళికిషోర్‌తోనే మరో సినిమా చేసేందుకు అఖిల్ ఆసక్తి చూపిస్తున్నాడట. పెద్ద సినిమాల వెంట పరిగెత్తే కంటే.. ఇలాంటి బలమైన కథలతో ముందు స్థానాన్ని సుస్థిరం చేసుకుని, ఆ తర్వాతే బాహుబలి, పుష్ప(Pushpa) రేంజ్ సినిమాలను ప్లాన్ చేయడమే అఖిల్‌కు సరైన రూట్ మ్యాప్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags
Akhil Akkineni Lenin Movie Lenin Akhil Murali Kishor Abburu Bhagyashri Borse Tollywood Telugu Cinema
Recent Comments
Leave a Comment

Related News