టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ నుంచి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్గెస్ట్ అప్డేట్ వచ్చేసింది. టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ మేకర్స్ వదిలిన క్రేజీ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఈ చిత్రంలో ప్రభాస్(Prabhas) లుక్ ఊహకందని రేంజ్‌లో ఉంది. యుద్ధభూమిలో శత్రువుల వేట ముగించి, సాంప్రదాయ పంచెకట్టులో చేతిలో రైఫిల్ పట్టుకుని సేదతీరుతున్న ప్రభాస్ రౌద్రరూపం అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. హను రాఘవపూడి మార్క్ క్లాస్‌కి, ప్రభాస్ మాస్ ఇమేజ్‌కి పర్ఫెక్ట్ బ్లెండ్‌లా కనిపిస్తున్న ఈ పోస్టర్, సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో హింట్ ఇచ్చేసింది. ఈ చిత్రంతో యంగ్ బ్యూటీ ఇమాన్వి టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది.
ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా రిలీజ్ సస్పెన్స్‌కి తెరదించుతూ, ఈ ఏడాది డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా ‘ఫౌజీ(Fauji)’ థియేటర్లలోకి రాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ఖరారు చేశారు. ఈ ఏడాది చివర్లో ప్రభాస్ నుంచి రాబోతున్న ఈ బిగ్గెస్ట్ విజువల్ ట్రీట్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.