గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకవైపు వరుస పాన్ ఇండియా సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తూనే, మరోవైపు తన పర్సనల్ లైఫ్‌ను కూడా అంతే రిచ్‌గా ప్లాన్ చేసుకుంటున్నారు. తాజాగా ఈ మెగా హీరో హైదరాబాద్ శివార్లలో నిర్మించుకున్న ఓ విలాసవంతమైన ఫామ్‌హౌస్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నగర కాలుష్యానికి దూరంగా, ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలనే ఉద్దేశంతో చరణ్-ఉపాసన దంపతులు ఈ సరికొత్త లగ్జరీ హౌస్‌ను ముస్తాబు చేశారు.
చేవెళ్ల – మోకిల పరిసర ప్రాంతాల్లో దాదాపు 5 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఈ డ్రీమ్ హోమ్ రూపుదిద్దుకుంది. దీని నిర్మాణానికి, ఇంటీరియర్ కోసం మెగా హీరో(Mega Hero) కోట్లాది రూపాయలు వెచ్చించినట్లు ఇన్ సైడ్ టాక్. ప్రముఖ సెలబ్రిటీ ఇంటీరియర్ డిజైనర్లు అమీర్ శర్మ, హమీదా శర్మల ఆధ్వర్యంలో ఈ ఇల్లు సరికొత్త ఆర్కిటెక్చర్‌తో తయారైంది. ఆధునిక హంగులు ఉంటూనే.. చుట్టూ పచ్చదనం పరిచేలా, ప్రకృతికి అద్దం పట్టేలా ఇండోర్-అవుట్‌డోర్ థీమ్‌తో ఒక ప్రైవేట్ రిసార్ట్ తరహాలో దీనిని తీర్చిదిద్దారు.
ఈ ఫామ్‌హౌస్ కేవలం వీకెండ్స్ గడపడానికే కాదు, ప్రకృతి సేద్యం కోసం కూడా చరణ్ ఉపయోగించబోతున్నారు. షూటింగ్‌ల బిజీ షెడ్యూల్స్ నుంచి బ్రేక్ దొరికినప్పుడు, తన భార్య ఉపాసన(Upasana), పిల్లలతో కలిసి ప్యూర్ నేచర్‌ను ఎంజాయ్ చేయడానికి చరణ్ ఈ ప్లాన్ చేశారు. ఇందులో కొంత భాగాన్ని సొంతంగా పండ్లు, కూరగాయల తోటల పెంపకానికి కేటాయించారు. కేవలం కుటుంబ సభ్యులు, ఇండస్ట్రీలోని అత్యంత సన్నిహితులకు మాత్రమే ఇక్కడ ఎంట్రీ ఉండనుంది. ప్రస్తుతం చరణ్ నటిస్తున్న భారీ ప్రాజెక్టుల షూటింగ్స్ ముగియగానే, మెగా ఫ్యామిలీ(Mega Family) సమక్షంలో ఈ సరికొత్త విల్లాలో అత్యంత వైభవంగా గృహప్రవేశ వేడుక జరగనుందని సమాచారం.