అఖిల్ నోట సమంత ముచ్చట.. ఆమె నిజంగానే..?

admin
Published by Admin — July 03, 2026 in Movies
News Image

అక్కినేని యువ హీరో అఖిల్(Akhil Akkineni) ప్రస్తుతం తన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘లెనిన్’ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్‌గా వస్తున్న ఈ సినిమా ఈనెల 10న థియేటర్లలోకి రాబోతోంది. ఎలాగైనా ఈసారి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కమర్షియల్ హిట్ కొట్టాలనే పట్టుదలపై ఉన్న అఖిల్, ప్రమోషన్స్ కోసం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా గడుపుతున్నాడు. అయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో అఖిల్ చేసిన కొన్ని కామెంట్స్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఈ ఇంటర్వ్యూలో తన మాజీ వదిన, స్టార్ బ్యూటీ సమంత(Samantha) గురించి అఖిల్ మాట్లాడిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సమంత లీడ్ రోల్‌లో నటిస్తున్న ‘మా ఇంటి బంగారం’ సినిమా ప్రస్తావన రాగా.. అఖిల్ చాలా పాజిటివ్‌గా స్పందించాడు. తామిద్దరూ ఇప్పుడు ఒకే ఫ్యామిలీ కాకపోయినప్పటికీ, సమంతపై తనకు ఉన్న గౌరవాన్ని చాటుకుంటూ అఖిల్ చేసిన వ్యాఖ్యలు అక్కినేని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నాయి.

‘మా ఇంటి బంగారం(Maa Inti Bangaram)’ సినిమా గురించి అఖిల్ మాట్లాడుతూ.. తాను ఇంకా సినిమా చూడలేదని, కానీ ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలో చాలా మంచి వైబ్స్ ఉన్నాయని అన్నాడు. ముఖ్యంగా సినిమా ట్రైలర్ చూసినప్పుడు తనకు చాలా బాగా నచ్చిందని, అందులో సమంత యాక్టింగ్ నిజంగా సూపర్బ్ గా ఉందని ప్రశంసించాడు. ట్రైలర్ చూస్తుంటేనే సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం కలిగిందంటూ, ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం కష్టపడిన సమంతతో పాటు చిత్ర యూనిట్ మొత్తానికి తన హృదయపూర్వక ఆల్‌ ది బెస్ట్ చెప్పాడు.

కాగా, అఖిల్(Akhil) నోట సమంత ముచ్చట విన్న నెటిజన్లు.. అత‌ని హుందాత‌నాన్ని ప్ర‌శంసిస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో విడిపోయి, ఫ్యామిలీ నుండి దూరం జరిగినప్పటికీ.. ఒక నటిగా సమంత టాలెంట్‌ను అఖిల్ గుర్తించి, ఇంత పాజిటివ్‌గా మాట్లాడటంపై సోషల్ మీడియాలో వ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. 

Tags
Akhil Akkineni Samantha Samantha Ruth Prabhu Lenin Movie Maa Inti Bangaram Tollywood
Recent Comments
Leave a Comment

Related News