ట్రంప్ పై మెలోనీ షాకింగ్ కామెంట్స్

admin
Published by Admin — June 21, 2026 in International
News Image

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఇటలీ ప్రధానమంత్రి మెలోని సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ అబద్దాలకోరని, మిత్రులను పట్టించుకోకుండా శత్రువులకు వంత పాడుతుంటారని షాకింగ్ కామెంట్స్ చేశారు. నవంబర్ మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ట్రంప్ పాపులారిటీ పడిపోతోందని, ఆ సంగతి చూడాలంటూ విమర్శలు గుప్పించారు. ఇటీవల ముగిసిన G7 సమావేశాలకు మెలోనీ కూడా హాజరయ్యారు. ఆ శిఖరాగ్ర సమావేశం ఉత్సాహపరితంగా ముగిసిందని ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే మెలోనీ ఈ రకంగా ట్రంప్ పై విమర్శలతో విరుచుకుపడడం షాకింగ్ గా మారింది.

ముఖ్యంగా ఇరాన్ తో శాంతి ఒప్పందంపై ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై జీ7కు చెందిన పలువురు నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయినా, సరే చివరకు అందరూ సర్దుకుపోయి ఆ సమావేశాన్ని విజయవంతంగా ముగించారు. అయితే సమావేశం ముగిసిన వెంటనే మెలోనీ డైరెక్ట్ గా ట్రంప్ పై ఎటాక్ చేయడం సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే మయామీలో జరగాల్సి ఉన్న అమెరికా ఇటలీ బిజినెస్ ఫోరంను ఇటలీ విదేశాంగ శాఖ రద్దు చేసింది. ఈ భేటీలో అమెరికా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బాక్స్ సిలికా అనే ఖనిజాల ఒప్పందంపై ఇటలీ సంతకం చేయాల్సి ఉంది. తాజాగా మెలోనీ వ్యాఖ్యలతో ఈ ఒప్పందం రద్దయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

గతంలో మెలోనీ అందాన్ని ట్రంప్ పొగిడినప్పుడు కూడా ట్రంప్ పై విమర్శలు వచ్చినా మెలోనీ స్పందించలేదు. అయితే ఇప్పుడు ట్రంప్ పై ఆమె వైఖరి పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. యూరప్ దేశాలలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ వంటి పలువురు నేతలు కూడా ట్రంప్ తో విభేదించినప్పటికీ డైరెక్ట్ గా విమర్శలు చేయలేదు. కానీ, మొదటిసారిగా మహిళా నేత అయిన మెలోని ట్రంప్ ను డైరెక్ట్ గా అటాక్ చేయడం సంచలనంగా మారింది. స్వతహాగానే రివేంజ్ మోడ్ లో ఉండే ట్రంప్ ఈ వ్యాఖ్యలపై ఏ విధంగా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.

Tags
trump meloni shocking comments liar
Recent Comments
Leave a Comment

Related News