రాజకీయాలకు పవన్ అన్ ఫిట్: కవిత

admin
Published by Admin — June 20, 2026 in Politics
News Image

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan)పై టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో జనసేన కార్యాలయాన్ని పవన్ ప్రారంభించిన నేపథ్యంలో ఆమె సంచలన కామెంట్లు చేశారు. తెలంగాణ రాజకీయాలకు పవన్ అన్ ఫిట్ అని, ఆయన ఇక్కడి రాజకీయాల్లోకి రాకూడదని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా యాక్టర్ల ముసుగులో వచ్చి రాష్ట్రాన్ని కబ్జా చేసే ప్రయత్నం గతంలో జరిగిందని, ఇప్పుడు పవన్‌ కూడా అదే విధంగా తెలంగాణ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు.

గతంలో ఆంధ్రా నటులు తెలంగాణ భాష, యాసను కించపరిచే డైలాగులు రాసేవారని, ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ యాసలోనే హీరోలు మాట్లాడే సినిమాలు తీస్తున్నారని గుర్తు చేశారు.

మేకప్, ప్యాకప్, సినిమాలు, షూటింగుల వరకు పవన్ ఓకే అని, కానీ సెక్రటేరియట్ దిక్కు చూస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో పవన్ సినిమాలు తీసుకోవచ్చని, రిలీజ్ చేసుకోవచ్చని, కానీ రాజకీయాలు తెలంగాణ బిడ్డలే చేయాలని అన్నారు.

పవన్ పక్కా ఆంధ్రా మనిషని, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అని చెప్పారు. అంతేకాదు, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన సందర్భంలో పవన్ 11 రోజులు అన్నం తినలేదని గుర్తు చేశారు. ఆంధ్రా వ్యక్తుల పెత్తనం వద్దని 1200 మంది తెలంగాణ బిడ్డల బలిదానంతో వచ్చిన రాష్ట్రంలో మళ్లీ ఆంధ్రా వ్యక్తులు రాజకీయం చేయకూడదని హెచ్చరించారు.

Tags
Pawan Kalyan unfit politics kalvakuntla kavita Trs
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News