జ‌న‌సేన.. జాతీయ పార్టీ.. ల‌క్ష్యం ఇదే!

admin
Published by Admin — June 12, 2026 in Andhra
News Image

ఏపీ కూటమి ప్ర‌భుత్వంలో కీల‌క పాత్ర పోషిస్తున్న జ‌న‌సేన పార్టీ.. ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాంతీయ పార్టీగానే ఉం ది. అయితే.. ఇక నుంచి దానిని జాతీయ‌స్థాయిలో విస్త‌రించే దిశ‌గా ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ణాళి క‌లు ర‌చిస్తున్న‌ట్టు తెలిసింది. ముఖ్యంగా జాతీయ‌స్థాయిలో కాక్రోచ్ జ‌న‌తాపార్టీ(సీజేపీ) ఆవిర్భ‌వించిన నేప‌థ్యంలో యువ‌త పెద్ద ఎత్తున ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు.

దీనిని ప‌సిగ‌ట్టిన బీజేపీ.. వెంట‌నే అలెర్ట్ అయింది. సీజేపీకి విరుగుడు మంత్రం క‌నిపెట్టే ప‌నిలో ప‌డింది. దీనిలో భాగంగా ప్ర‌జ‌ల్లో ఇమేజ్ ఉన్నా.. మంచి ప‌దునైన స్వ‌రంతో త‌న వాగ్ధాటిని ప్ర‌ద‌ర్శించ‌గ‌ల నాయ‌కు డిగా ఉన్న‌ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఎంపిక చేసుకున్న‌ట్టు జాతీయ మీడియా వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ క్ర‌మం లో జ‌న‌సేన పార్టీని జాతీయ‌స్థాయిలో విస్త‌రించే దిశ‌గా స‌మాలోచ‌న‌లు జ‌రిపాని స‌మాచారం.

ఆ త‌ర్వాతే.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తెలంగాణ‌లో పార్టీ విస్త‌రిస్తామ‌ని ప్ర‌క‌టించిన‌ట్టు కూడా జాతీయ మీడియా చెబుతోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో బీజేపీ అత్యంత ముఖ్య నాయ‌కులు చ‌ర్చించార‌ని.. సీజేపీ వంటి వాటికి చెక్ పెట్టాలంటే.. అంతే బ‌ల‌మున్న యువ‌త‌రాన్ని ఆక‌ర్షించ‌గ‌ల నాయ‌కుల అవ‌స‌రం ఉంద‌ని భావించార‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ సేనా గ‌ళం పేరుతో కొత్త విభాగాన్ని ప్ర‌క‌టించారు.

తాజాగా ఢిల్లీలో ప‌ర్య‌టించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఈ విష‌యంపై ప‌లు ఎన్డీయే కూట‌మి పార్టీల‌తోనూ చ‌ర్చించి న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం జాతీయ‌స్థాయిలోనూ.. బీజేపీ త‌ర‌ఫున యువ‌త ను ఆక‌ర్షించే నాయ‌కుల కొర‌త వెంటాడుతోంది. దీనికితోడు నిన్న‌గాక మొన్న పుట్టిన‌.. సీజేపీకి కౌంట‌ర్లు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే జ‌న‌సేన జాతీయ‌స్థాయిలో విస్త‌రించాల‌న్న సూచ‌న‌లు వ‌చ్చాయ‌ని తెలిసింది.

ఈ నెల‌14 నుంచి నాలుగు రోజుల పాటు జ‌న‌సేన పార్టీ అనుబంధం విభాగంగా ఏర్ప‌డుతున్న సేనా గ‌ళం కార్య‌క్ర‌మాల‌ను జాతీయ‌స్థాయిలో విస్త‌రించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతు న్నాయి. ఈ కార్య‌క్ర‌మాల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా భాగ‌స్వామ్యం కానున్నార‌ని అంటున్నారు. త‌ద్వారా.. సేనాగ‌ళం జాతీయ స్థాయిలో విస్త‌రించి.. సీజేపీ వంటి వాటికి బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థిగా నిలిచే అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు. ఈ దిశ‌గా ప‌వ‌న్ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసిన‌ట్టు తెలిసింది. 

Tags
Janasena trying national party
Recent Comments
Leave a Comment

Related News