కుప్పంలో ఏం జరుగుతోంది? చంద్రబాబు ఆరా!

admin
Published by Admin — June 12, 2026 in Andhra
News Image

సీఎం చంద్ర‌బాబు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌కుప్పం నియోజ‌క‌వ‌ర్గం, టీడీపీ సీనియ‌ర్‌నాయ‌కుడు, న‌ట‌సిం హం నంద‌మూరి బాల‌కృష్ణ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న హిందూపురం నియోజ‌క‌వ‌ర్గాలు.. హాట్‌టాపిక్‌గా మారాయి. రాత్రికి రాత్రి.. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌పై సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌వేక్ష‌ణ చేయాల్సిన ప‌రిస్థితి కూడా వ‌చ్చింది. అంతేకాదు.. తాను స్వ‌యంగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పంలో మార్పులు కూడా చేసే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇక‌, హిందూపురం విష‌యంపై పార్టీ నేత‌ల నుంచి నివేదిక‌లుకోరారు.

ఏం జ‌రిగింది..?

కుప్పం నియోజ‌క‌వ‌ర్గం అయినా.. హిందూపురం నియోజ‌క‌వ‌ర్గం అయినా.. ఈ రెండు స్థానాల్లో గెలిచిన వా రు.. నిరంత‌రం ఏదో ఒక ప‌నిపై బిజీగా ఉంటున్నారు. ముఖ్య‌మంత్రిగా రాష్ట్ర పాల‌నా బాధ్య‌త‌లు చూస్తు న్నారు చంద్ర‌బాబు. ఇక, అటుసినిమాలు.. ఇటు ప్ర‌జానాయ‌కుడిగా బాల‌య్య కూడా బిజీగా ఉన్నారు. దీంతో త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో నివ‌సించేందుకు.. నిరంత‌రం ప‌ర్య‌వేక్షించేందుకు వారికి అవ‌కాశం లేకుండా పోయింది. దీంతో న‌మ్మ‌క‌మైన వ్య‌క్తుల‌ను నియ‌మించి బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

అయితే.. ఈ న‌మ్మ‌క‌స్తులే.. ఇప్పుడు చంద్ర‌బాబుకు బాల‌య్య‌కు కూడా కంట్లో న‌లుసుగా మారారు. కుప్పం లో కంచ‌ర్ల శ్రీకాంత్ చేతి వాటం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. సొంత పార్టీ నాయ‌కు ల‌ను లెక్క చేయ‌క‌పోవ‌డంతో పాటు... అక్ర‌మాల‌కు కూడా తెర‌దీశార‌ని.. గ‌త రెండు మాసాల కింద‌టే వాద న వినిపించింది. సీఎం స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రికి సైతం శాంతి పురం మండ‌ల కార్య‌క‌ర్త‌లు, నాయ‌కు లు త‌మ గోడును వెళ్ల‌బోసుకున్నారు. తాజాగా మ‌రిన్ని ఫిర్యాదులు కూడా వ‌చ్చాయి.

దీంతో చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గం ప‌ర్య‌వేక్ష‌కుడిగా నియ‌మించిన కంచ‌ర్ల శ్రీకాంత్‌ను త‌ప్పించారు. ఆయ న స్థానంలో మ‌రో నేత‌కు అవ‌కాశం ఇచ్చారు. ఇక‌, హిందూపురంలో బాల‌య్య వ్య‌వ‌హారాల‌ను చూసేందు కు నియ‌మించిన వ్య‌క్తి గ‌తంలోనూ వివాదాస్ప‌ద‌మ‌య్యారు. దీంతో 2014-19 మ‌ధ్య ఇద్ద‌రిని ప‌ర్య‌వేక్ష‌కు లుగా మార్చారు. ఆ త‌ర్వాత‌.. నియ‌మించిన ప‌ర్య‌వేక్ష‌కుడు కూడా.. నియోజ‌క‌వ‌ర్గంలో చేతివాటం ప్ర‌ద‌ర్శించ‌డం.. స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోకుండా.. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌కుండా వీకెండ్ కు వ‌చ్చి పోతున్నారు.ఈ వ్య‌వ‌హారంపై పార్టీ నాయ‌కుల నుంచి ఫిర్యాదులు రావ‌డంతో తాజాగా చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిస్థితుల‌పై నివేదిక కోరారు. ఆ త‌ర్వాత చ‌ర్య‌లు ఉంటాయ‌ని తెలుస్తోంది. 

Tags
Cm chandrababu kuppam tdp
Recent Comments
Leave a Comment

Related News