నందమూరి వెర్సస్ మంచు.. అప్పుడలా, ఇప్పుడిలా

admin
Published by Admin — May 21, 2026 in Movies
News Image

ఈ రోజు టాలీవుడ్‌కు చాలా స్పెషల్ డే. లెజెండరీ లిరిసిస్ట్, దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రితో పాటు టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన జూనియర్ ఎన్టీఆర్, విలక్షణ నటుడు మంచు మనోజ్‌ల పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా సిరివెన్నెలను ఆయన అభిమానులు స్మరించుకుంటున్నారు. తారక్ పుటిన రోజును ఫ్యాన్స్ వేరే లెవెల్లో సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వచ్చిన ‘డ్రాగన్’ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. మనోజ్‌‌కు కూడా ఈ పుట్టిన రోజును స్పెషల్‌గా మారుస్తూ.. నందమూరి బాలకృష్ణ సినిమాలో అతను నటిస్తున్న విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ విషెస్ చెప్పింది చిత్ర బృందం. ‘వీరసింహారెడ్డి’ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న చిత్రమిది. మనోజ్ ఇందులో నటించడం సినిమా మీద ఆసక్తిని మరింత పెంచేదే అనడంలో సందేహం లేదు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ‘మిరాయ్’ చిత్రంలో చేసిన నెగెటివ్ రోల్‌తో మనోజ్ ఎంత మంచి పేరు సంపాదించాడో తెలిసిందే.

ఇప్పుడు బాలయ్య సినిమాలో కూడా అతను విలన్‌గానే కనిపించనున్నట్లు తెలుస్తోంది. నందమూరి సీనియర్ హీరోను మంచు యంగ్ హీరో ఢీకొడితే ఆ కిక్కే వేరుగా ఉంటుందని భావిస్తున్నారు. బాలయ్య, మనోజ్ కలిసి నటించడం ఇదే తొలిసారి కాదు. మనోజ్ కెరీర్లో ఒకప్పుడు హైయెస్ట్ హైప్ తెచ్చుకున్న ‘ఊకొడతారా ఉలిక్కి పడతారా’లో బాలయ్య ప్రత్యేక పాత్ర పోషించారు. ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు కానీ.. అందులో బాలయ్య క్యారెక్టర్, ఆయన పెర్ఫామెన్స్ భలేగా అనిపిస్తాయి. ఆ సినిమాకు హైప్ తేవడంలో ఆయన పాత్ర కూడా కీలకం. విశేషం ఏంటంటే.. గతంలో బాలయ్య తండ్రి నందమూరి తారక రామారావు, మనోజ్ ఫాదర్ మోహన్ బాబు ఎన్నో చిత్రాల్లో కలిసి నటించారు. వాళ్లిద్దరూ కలిసి నటించిన చివరి చిత్రం ‘మేజర్ చంద్రకాంత్’ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాని కంటే ముందు ‘కొండవీటి సింహం’, ‘సర్దార్ పాపారాయుడు’ లాంటి హిట్ సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు. ఈ సూపర్ కాంబోను కొనసాగిస్తూ ఇప్పుడు మరోసారి బాలయ్య, మనోజ్ కలిసి తెరపై కనిపించబోతున్నారు. 

Tags
Manchu manoj balakrishna movie
Recent Comments
Leave a Comment

Related News