వైద్యో నారాయణో హరి...అంటే వైద్యుడు దేవుడితో సమానం. మనిషికి దేవుడు జన్మనిస్తే...చాలామంది మనుషులకు డాక్టర్లు పునర్జన్మ ఇస్తారు. అందుకే భారత దేశంలో దేవుడి తర్వాత చాలామంది చేతులెత్తి దండం పెట్టేది ఒక్క డాక్టర్ కే అంటే అతిశయోక్తి కాదు. అయితే, ఈ ‘కార్పొరేట్’ కాలంలో పరిస్థితులు కాస్త మారాయి. చాలామంది డాక్టర్లు కమర్షియల్ గా మారిపోయారని, పేషెంట్లతో ఓపికగా మాట్లాడి వారి సమస్యను తెలుసుకొనే తీరిక చాలామంది డాక్టర్లకు లేదని చాలామంది పేషెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు.
పేషంట్లతో 5 నిమిషాలు మొక్కుబడిగా నాలుగు ముక్కలు మాట్లాడడం...టెస్టులు చేయించడం, మందులు రాయడం...నెల తర్వాత రివ్యూకి రమ్మని చెప్పడం...వంటి పరిస్థితులు చాలా హాస్పిటళ్లలో ఉన్నాయని పేషెంట్లు వాపోతుంటారు. అందరు డాక్టర్లు అలా ఉన్నారని అనడం లేదు. అలా అని ఆ విధంగా వ్యవహరిస్తున్న డాక్టర్లను...వారి తీరుపట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్న పేషెంట్లను తప్పు బట్టలేం. ఎవరికి ఉండే ఇబ్బందులు వారికుంటాయి.
అయితే, ఇటువంటి కార్పొరేట్ కల్చర్ లోనూ ఒక డాక్టర్ పేషెంట్లతో ప్రేమగా మాట్లాడుతున్నారు. ఆప్యాయంగా అమ్మా, బాబూ, అన్నా, కాకా, మమ్మీ అంటూ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. పేషెంట్ తో కనీసం 10 నిమిషాలు మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలతో పాటు వారి ఉద్యోగ, వ్యాపార, కుటుంబ వివరాలు కూడా అడిగి తెలుసుకుంటున్నారు. నేను మీలో ఒకడిని అంటూ పేషెంట్లతో మమేకమవుతున్నారు...మీ ఇంటికి నేను పెద్ద కొడుకును అంటూ వారి అనారోగ్య సమస్యలు తీర్చే బాధ్యతను తన భుజాలపై వేసుకుంటున్నారు.
మానవ సేవే..మాధవ సేవ అని నమ్మడమే కాదు...ఆచరిస్తూ ఎందరో డాక్టర్లకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు... తన హాస్పిటల్ ఓపీ ఫైల్ మీద ‘మానవత్వమే నా మతం‘ అని ప్రింట్ చేయించడమే కాదు...మానవత్వమే మతంగా వైద్యం చేస్తూ వేలాది మంది ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారు. కొందరు పేషెంట్లు ఆయనను దేవుడంటూ చేతులెత్తి మొక్కుతున్నారు...ఎన్నో ఏళ్లుగా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న.తమ జీవితాల్లో వెలుగులు నింపిన ఆశాజ్యోతి అంటూ మరికొందరు ఆయన కాళ్లు మొక్కుతున్నారు....అయితే, తాను దేవుడుని కాదని...మీలో ఒకడిని అని..మీ కుటుంబ సభ్యుడినని ఆయన వినయంతో చెబుతుంటారు. ఆయనే తెలంగాణలోని కరీం నగర్ కు చెందిన డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్.
తన హాస్పిటల్ ఓపీ ఫైల్ మీద ‘మానవత్వమే నా మతం‘ అని ప్రింట్ చేసి ఉండడం ఎక్కడైనా చూశారా? ఒకవేళ చూసినా...అది ఆచరించే డాక్టర్ ఎవరైనా మీకు తెలుసా? కానీ, డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్, ఎండీ, డీఎమ్(న్యూరో) ఆ కొటేషన్ ను తు.చ తప్పకుండా పాటిస్తున్నారు. ఈ మధ్యకాలంలో మీడియాలో, సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన డాక్టర్ విక్రాంత్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు.
కరీం నగర్ లోని టైమ్ న్యూరో కేర్ & పెయిన్ క్లినిక్ నడుపుతున్న డాక్టర్ విక్రాంత్ వీడియోలు సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో వైరల్ అవుతున్నాయి. కొంతమంది ఆయనను వైరల్ డాక్టర్ అంటూ ఉంటారు. కానీ , వీడియోలు వైరల్ అవుతున్నాయి కాబట్టి ఆయన దగ్గరకు పేషెంట్లు రావడం లేదు. రోగాలు నయం అవుతున్నాయి కాబట్టి ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల నుంచి రోజూ వందలాది మంది పేషెంట్లు ఆయనకు కలిసేందుకు కరీం నగర్ వస్తున్నారు. ఈ కలికాలంలో ఇంకా ఈ రకంగా వైద్యం చేస్తున్న డాక్టర్ ను నేరుగా కలవాలని ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
న్యూరో ఫిజీషియన్ గా పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్ వంటి న్యూరోలాజికల్ డిజార్డర్స్ తో ఎన్నో ఏళ్లుగా బాధపడుతున్న వేలాది మంది పేషెంట్లకు నయం చేసిన ఘనత డాక్టర్ విక్రాంత్ ది. వాటితో పాటు కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, హై బీపీ, టైప్ 2 డయాబెటిస్ వంటి ఎన్నో జీవన శైలి రుగ్మతలకు డైట్ తోనే చెక్ పెట్టొచ్చు అంటూ నిరూపిస్తున్నారు డాక్టర్ విక్రాంత్. అవసరమైన పేషెంట్లకు డైట్ తో పాటు కొద్దికాలంపాటు కొన్ని మందులు రాసి ఇస్తూ పేదలు, మధ్యతరగతి ప్రజల పాలిట ఆరాధ్య దైవమయ్యారు ఈ డాక్టర్. అంతేకాదు, అవసరాన్ని బట్టి బ్లడ్ టెస్టులతో పాటు ఇతరత్రా టెస్టులు చేయించే ఈ డాక్టర్....ఆర్థిక పరిస్థితి బాగోలేని పేషెంట్ల దగ్గర అతి తక్కువ డబ్బు తీసుకొని చికిత్స చేస్తున్నారు.
ముఖ్యంగా రిఫైన్డ్ షుగర్, రిఫైన్డ్ ఆయిల్ వాడడం మాని వేయాలని, ప్రత్యామ్నాయంగా గానుగ పట్టించిన ఫల్లీ‘(వేరుశెనగ విత్తనాలు) నూనె వాడాలని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. అలా చేస్తే చాలా జబ్బులు దరిచేరవని అంటున్నారు. నెయ్యిపై ఉన్న ఆపోహలను తొలగిస్తూ, ప్రతి రోజూ పరిమిత మోతాదులో అన్నం, గుడ్లు, మటన్ వంటి నాన్ వెజ్ ఆహారం డాక్టర్ సూచించిన మోతాదులో తింటే చాలా లైఫ్ స్టైల్ డిసీజెస్ కు, రోగాలకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు. అదే సమయంలో వెజిటేరియన్స్ కూడా పరిమిత మోతాదులో అన్నం, పెసర పప్పు, కొన్ని రకాల కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ వంటివి తీసుకొని అనారోగ్య సమస్యలు దూరం చేసుకోవచ్చని సలహా ఇస్తున్నారు.
మూడు సార్లు తింటే రోగి, రెండుసార్లు తింటే భోగి, ఒకసారి తింటే యోగి అంటారు డాక్టర్ విక్రాంత్. అయితే, పేషెంట్ ఆరోగ్య పరిస్థితి, రుగ్మతలను బట్టి వారికి డైట్ సూచిస్తుంటారు. అందరు పేషెంట్లకు ఒకటే డైట్ ఉండదని చెబుతుంటారు.
డాక్టర్ విక్రాంత్ హస్తవాసి మంచిదని కొందరు పేషెంట్లు అంటుంటారు. హస్తవాసి కన్నా ఆయన మనసు ఇంకా మంచిది. మండుటెండలో తన కోెసం వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన పేషెంట్లు గంటల తరబడి తన కోసం వేచి ఉండడం చూసి ఆయన చలించి పోయి వారి కోసం హుటాహుటిన రేకుల షెడ్డు వేయించి, కూలర్లు పెట్టించిన దయార్ధ్ర హృదయుడు ఆయన. తాను చెప్పిన డైట్ ఫాలో కాని పేషెంట్లను చూసి ఆవేదన చెంది...డైట్ పాటించండి అంటూ చేతులెత్తి మొక్కి మరీ కంటతడి పెట్టుకున్న కరుణామయుడు ఆయన.
100 మంది పేద విద్యార్థులకు ఒక్కొక్కరికీ 10 వేల రూపాయల చొప్పున మొత్తం 10 లక్షల రూపాయలు స్కాలర్ షిప్ అందించిన సామాజికవేత్త. పెళ్లిళ్లు, ఫంక్షన్లలో ఆహారం వడ్డించే ప్లాస్టిక్ ప్లేట్ వల్ల క్యాన్సర్ వస్తుందని, అది ప్లాస్టిక్ ప్లేట్ కాదు..క్యాన్సర్ ప్లేట్ అని సమాజ హితం కోరుతూ డాక్టర్ విక్రాంత్ ఇచ్చిన పిలుపు మేరకు ఒక గ్రామంలో ప్లాస్టిక్ ప్లేట్లు వాడడం ఆపేసి వాటి స్థానంలో స్టీల్ ప్లేట్లు పెట్టారు. దీనిని బట్టి ఆయన మాటలు ప్రజలపై ఏ రేంజ్ లో ప్రభావం చూపిస్తున్నాయో అర్థమవుతోంది.
మొబైల్ ఫోన్లను ఎక్కువ సేపు వాడడం వల్ల పిల్లలు, పెద్దలకు కలిగే అనర్థాలపై, ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్ళు తాగడం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. గాజు సీసాలో నీళ్లు తాగడం మంచిదని చెబుతున్నారు. తల్లిదండ్రులను ప్రేమించాలని... అన్నదమ్ముల పిల్లలను తమ పిల్లలాగా ప్రేమగా చూసుకోవాలని కుటుంబ విలువలు గురించి గొప్పగా చెబుతున్నారు. వేసవికాలంలో తమ వీధుల్లో మట్టికుండలతో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని యువతకు పిలుపునిస్తున్నారు. జీవన శైలి, ఆహారపు అలవాట్లకు సంబంధించిన ఎన్నో విలువైన టిప్స్ ఇస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్నారు. ఇలా కేవలం వైద్యం, డైట్ పై మాత్రమే కాకుండా సామాజిక అంశాలు, సమాజ సేవపై ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్న డాక్టర్ విక్రాంత్ ఎందరికో ఆదర్శప్రాయం.
తనకు తెలిసిన మంచి విషయాన్ని పేషెంట్లకు చెప్పానని, డైట్ పాటించి తాను ఫలితాలు పొందిన విషయాన్ని తన పేషెంట్లకు వివరించానని ఆయన చెబుతున్నారు. తాను చెప్పింది చెప్పినట్లు చేయడం, అవసరమైన మందులు వేసుకోవడం, దేవుడి దయ వల్లే పేషెంట్లకు నయమవుతోందని అంటున్నారు. చారానా చేసి బారానా క్రెడిట్, పబ్లిసిటీ ఆశించే ఈ రోజుల్లో...తాను నిమిత్తమాత్రుడిని అంటూ సింప్లిసిటీకి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు డాక్టర్ విక్రాంత్.
డాక్టర్ విక్రాంత్ మాదిరిగానే ఆయన సతీమణి డాక్టర్ పావని విక్రాంత్ (ఎండీ ఎనస్థీషియా, ఎఫ్ఐపీఎమ్, పెయిన్ అండ్ క్రిటికల్ కేర్ నిపుణురాలు) నిస్వార్థంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ఏళ్ల తరబడి మెడ నొప్పి, వెన్ను నొప్పి, మోకాళ్ల నొప్పులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సయాటికా వంటి దీర్ఘకాలిక నొప్పులతో నరకం అనుభవిస్తున్న పేషెంట్ల నొప్పిని దూరం చేస్తున్నారు. డైట్ పట్ల పేషెంట్లకు ఒకటికి రెండుసార్లు ఎంతో ఓపికతో అవగాహన కల్పిస్తున్నారు. ఏ మాత్రం విసుగు చెందకుండా పేషెంట్లు, అటెండర్లు అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ వారి సందేహాలను నివృత్తి చేస్తున్నారు. అంతేకాదు, నొప్పిని తగ్గించేందుకు అవసరమైన అతి తక్కువ మోతాదు మందులను మాత్రమే సూచిస్తున్నారు. ముఖ్యంగా మహిళా పేషెంట్ల సమస్యలను తెలుసుకుంటూ తానున్నానంటూ భరోసానిస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు.
అయితే, నిజాయితీగా, నిబద్ధతతో, నిస్వార్ధంగా అసలు సిసలు వైద్యులుగా ప్రజలకు వైద్యం అందిస్తున్న క్రమంలో డాక్టర్ విక్రాంత్, డాక్టర్ పావని కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. నాన్ వెజ్, గుడ్లు తింటే రోగాలు నయమవుతాయట అంటూ కొందరు డాక్టర్లే...డాక్టర్ విక్రాంత్ ను హేళన చేశారు. కొందరు పేషెంట్లు అవగాహనా లోపంతో పొరపాటున తాము గతంలో చికిత్స పొందిన ఆసుపత్రి పేరు చెప్పారు. దీంతో, ఆ వీడియోలను ఆసరాగా తీసుకొని ఆయనపై కొందరు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేశారు. పేషెంట్లు పొరపాటున అలా చెప్పారని తనకు ఎవరూ శత్రువులు లేరని డాక్టర్ విక్రాంత్ చెబుతున్నారు. ఆ తర్వాత అలా పేర్లు చెప్పవద్దని పేషెంట్లకు సూచించారు.
అయితే, డాక్టర్లంతా తన ఫ్యామిలీ అని, తన ఫెటర్నిటీ నుంచి తనకి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు. కానీ, సమాజంలో కొందరు మాత్రం తనపై ఈర్ష్య, అసూయతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని అన్నారు. అటువంటివారి వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. నిస్వార్ధంగా ప్రజలకు వైద్య సేవలు అందించడం, పేషెంట్లను తన కుటుంబ సభ్యులుగా భావించి వారికి డైట్ పై అవగాహన కల్పించడమే తాను చేసిన తప్పా అని డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ ప్రశ్నిస్తున్నారు.
అయితే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటానని, నిస్వార్థంగా ప్రజలకు వైద్యం చేయడం తన వృత్తి ధర్మం అని, అదే తన లక్ష్యమని అంటున్నారు. తనతోపాటు అందరూ ఈ భూమి మీదకు ఖాళీ చేతులతో వచ్చామని, పోయేటప్పుడు కూడా వెంట ఏమీ తీసుకుపోమనే తత్వాన్ని తాను నమ్ముతానని, అదే నలుగురికి చెబుతానని అంటున్న తత్వవేత్త డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్. సోషల్ మీడియాలో తాను వైరల్ అయినా... తనకు పేరు ప్రఖ్యాతలు వచ్చినా అవన్నీ తాను పట్టించుకోనని.. అంటున్న సాదాసీదా మనిషి ఆయన.
ఆన్ లైన్ అపాయింట్మెంట్ పొందడం ఎలా?
గతంలో డాక్టర్ విక్రాంత్ అపాయింట్మెంట్ కోసం హాస్పిటల్ నంబర్ (9908248384) కు ఫోన్ చేసినా, నేరుగా వచ్చినా సరిపోయేది. కానీ, డాక్టర్ విక్రాంత్ చేస్తున్న అద్భుతాల గురించి తెలుసుకున్న ప్రజలు ప్రతిరోజూ వందల సంఖ్యలో ఏపీ, తెలంగాణ నుంచి ఆసుపత్రికి వస్తున్నారు. అయితే, రోజుకు వీలైనంత మందిని చూసిన తర్వాత ఇంకా చాలామంది మిగిలిపోయేవారు. ఇలా పేషెంట్లు పడుతున్న ఇబ్బంది చూసి చలించిపోయిన డాక్టర్ విక్రాంత్ ఆన్ లైన్ అపాయింట్మెంట్ విధానాన్ని తీసుకువచ్చారు.
అపాయింట్మెంట్ కోసం ఒక యాప్, వెబ్ సైట్ ను రూపొందించారు. ఈ విషయం గురించి తన యూట్యూబ్ ఛానెల్, ఫేస్ బుక్, ఇన్ స్టా పేజీలలో వీడియోలు కూడా పెట్టారు. అయితే, ఇంకా కొందరు పేషెంట్లు అవగాహన లేక ఫోన్ ద్వారా, నేరుగా ఆస్పత్రికి వచ్చి అపాయింట్మెంట్ కావాలని అడుగుతున్నారు. అయితే, ఆదరాబాదరాగా పేషెంట్లను చూడడం తనకు నచ్చదని, ఒక పేషెంట్ తో కనీసం 10 నిమిషాలు మాట్లాడితేనే వారి సమస్య తనకు తెలుస్తుందని.. డాక్టర్ విక్రాంత్ చెబుతున్నారు.
ప్రస్తుతం రోజుకు 75-80 ఫ్రెష్ అపాయింట్మెంట్ లు ఇస్తున్నామని, వాటితోపాటు ఫాలో అప్ పేషెంట్లు 70-80 మంది కూడా వస్తున్నారని, కాబట్టి అపాయింట్మెంట్ లేకుండా నేరుగా వచ్చేవారిని చూడడం కుదరడం లేదని చెబుతున్నారు. అందుకే, దయచేసి ముందస్తుగా యాప్ లేదా వెబ్ సైట్ లో పేషెంట్ పేరు మీద ఆన్ లైన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలని, అపాయింట్మెంట్ దొరికిన తేదీన మాత్రమే ఆసుపత్రికి రావాలని కోరుతున్నారు. ఆఫ్ లైన్ అపాయింట్మెంట్ విధానం లేదన్న విషయాన్ని గుర్తించాలని కోరారు. అపాయింట్మెంట్ ల గురించి ఏవైనా సందేహాలుంటే హాస్పిటల్ నంబర్ (9908248384) కు ఉదయం 8 నుంచి 10 గంటల మధ్యలో ఫోన్ చేయాలని చెబుతున్నారు. తాను చెప్పే అన్ని విషయాలు తన యూట్యూబ్ ఛానల్, ఫేస్ బుక్ ఖాతాలో అందుబాటులో ఉన్నాయని, వాటిని చూసి డైట్ పై అవగాహన పెంచుకోవాలని చెబుతున్నారు.
అపాయింట్మెంట్ టైమ్ (నిర్దేశించిన సమయానికి) కంటే 2 గంటలు ముందు ఆసుపత్రికి రావడం వల్ల పేషెంట్లు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం ఉండదని ఆసుపత్రి సిబ్బంది సూచిస్తున్నారు. స్క్రీనింగ్, అవసరమైతే రక్త పరీక్షలు, ఇతరత్రా పరీక్షలు చేయాల్సి వస్తుందని, కాబట్టి ఆసుపత్రిలో 2-3 గంటలు ఉండాల్సి వస్తుందని, అందుకు తగ్గట్లు రావాలని పేషెంట్లను కోరుతున్నారు.
ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఆన్ లైన్ అపాయింట్మెంట్స్ కోసం స్లాట్స్ ఓపెన్ అవుతాయని తెలిపారు. ఆ ఆదివారం తర్వాత వచ్చే సోమవారం నుంచి శనివారం వరకు(ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మీకు వెసులుబాటు ఉన్న సమయం చూసి అపాయింట్మెంట్ స్లాట్ బుక్ చేసుకోవాలి) మాత్రమే అపాయింట్మెంట్ స్లాట్స్ అందుబాటులో ఉంటాయన్న విషయాన్ని గమనించాలని కోరుతున్నారు. ఒకవేళ ఒక ఆదివారం అపాయింట్మెంట్ దొరకని వారు మరుసటి ఆదివారం ప్రయత్నించాలని కోరుతున్నారు. అలా కాకుండా నేరుగా హాస్పిటల్ కి వచ్చి అపాయింట్మెంట్ కావాలని డాక్టర్ గారిని ఇబ్బంది పెట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆన్ లైన్ అపాయింట్మెంట్ కోసం ప్లే స్టోర్ లో
Dr.VikrantSinghThakur యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. పేషెంట్ పేరు మీద మాత్రమే యాప్ లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
లేదంటే drvikrantsinghthakur.com ను సందర్శించి పేషెంట్ పేరు మీద అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఎన్నో ఆస్పత్రులు చుట్టూ తిరిగినా లక్షల రూపాయలు ఖర్చుపెట్టినా నయం కానీ రోగాలు డాక్టర్ విక్రాంత్ సింగ్ దగ్గరకు వచ్చిన తర్వాత నయమయ్యాయి అంభావోద్వేగంతో ఆ పేషెంట్లు చెప్పే మాటలు..వారి కళ్ళల్లో ఆనందం వర్ణనాతీతం. అయితే ఆ పేషెంట్ల కళ్ళల్లో ఆనందం చూసి అంతకుమించి ఆనందపడే అరుదైన డాక్టర్ ఈయన. తాను వైద్యం చేసిన రోగులకు నయం అయితే వచ్చే ఆత్మ సంతృప్తికి మరేదీ సాటి రాదంటూ సంతోషం వ్యక్తం చేసే విక్రాంత్ సింగ్ ఠాకూర్ వంటి వైద్యులను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు.
కలియుగ 'వైద్య' నారాయణుడు డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ వంటి డాక్టర్లు నూటికో, కోటికో ఒకరుంటారు. అటువంటి మంచి మనుషులపై అక్కసు వెళ్ళగక్కేవారు, అసూయపడేవారు, ఈర్ష్య పడేవారు కొందరు ఉంటారు. అటువంటి కొందరు డాక్టర్ విక్రాంత్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు.
అటువంటి వారు సృష్టించే ఇబ్బందులు, ఆటంకాలు అధిగమించి వేలాదిమందికి డాక్టర్ విక్రాంత్ వైద్యం అందించాలని ఆశిద్దాం. భవిష్యత్తులో సమయం వచ్చినప్పుడు, అవసరమైనప్పుడు డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ కు అండగా, మద్దతుగా నిలవడం ఆయన దగ్గర వైద్యం పొందిన పేషెంట్లతోపాటు మెరుగైన సమాజం కోరుకునే ప్రజలందరి సామాజిక బాధ్యత!
https://youtube.com/shorts/rOLtyRR55qk?si=Th2i2nR4V4GJt65d
https://youtube.com/shorts/kkXuRwGMV5Q?si=ItqvTvR9YAed654N