షాకింగ్...అనుకున్నదే చేసిన మోదీ..!

admin
Published by Admin — May 16, 2026 in National
News Image

దేశ‌వ్యాప్తంగా పెట్రోలు డీజిల్ ధ‌ర‌లు పెరిగిపోయాయి. శుక్ర‌వారం ఉద‌యాన్నే.. ప్ర‌జ‌లు నిద్ర లేస్తూనే.. ఈ వార్త వినాల్సి వ‌చ్చింది. శుక్ర‌వారం ఉద‌యం 6గంట‌ల నుంచే ఈ నిర్ణ‌యం అమ‌లు కానుంది. దీని ప్ర‌కారం.. లీట‌రు పెట్రోలు, లీట‌రు డీజిల్‌పై రూ.3 చొప్పున ధ‌ర‌లు పెరిగిపోయాయి. ఈ మేర‌కు ఆయిల్ కంపెనీలు శుక్ర‌వారం ఉద‌యాన్నే ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశాయి. పెట్రోలు 3.14 రూపాయ‌లు, డీజిల్ 3.11 రూపాయ‌ల చొప్పున పెంచ‌డం గ‌మ‌నార్హం.

పాత విధానంలో..

మ‌రోవైపు.... పెట్రోలు, డీజిల్‌, వంట గ్యాస్ ధ‌ర‌ల‌ను.. పాత విధానంలో స‌మీక్షించే దిశ‌గా కేంద్ర ప్ర‌భుత్వం అడుగులు వేసింది. గ‌తంలో యూపీఏ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు.. ప్ర‌తి 15 రోజుల‌కు ఒక‌సారి స‌మీక్షించి.. ధ‌ర‌ల‌ను పెంచే వారు. లేదా త‌గ్గించేవారు. ప్ర‌స్తుతం ఆ విధానాన్ని ప‌క్క‌న పెట్టారు. వాస్త‌వానికి రెండేళ్లుగా పెట్రోలు ధ‌ర‌లు పెంచ‌లేదు. ఎన్నిక‌ల నేప‌థ్యానికి తోడు క‌రోనా ఎఫెక్ట్ కూడా దీనికి కార‌ణ‌మ‌ని తెలుస్తోం ది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు పాత విధానంలో స‌మీక్షించే దిశ‌గా ఆలోచ‌న చేస్తున్నారు.

ఎంత వ‌ర‌కు?

ఈ ధ‌ర‌ల పెంపు నిరంత‌రాయంగా కొన‌సాగుతుంద‌న్న చర్చ సాగుతోంది. ప్ర‌స్తుతం కేంద్ర ప్ర‌భుత్వం దాదాపు 80 వేల కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు రాయితీల రూపంలో చెల్లిస్తున్న‌ట్టు పేర్కొంది. ఈ నేప‌థ్యంలో ఆ భారం మ‌రింత పెరుగుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ప‌శ్చిమాసియానే కాకుండా.. ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం కార‌ణంగా కూడా.. పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు ఆధార‌ప‌డి ఉన్నాయి. ఆయా యుద్ధాలు ఆగిన‌ప్పుడు మాత్ర‌మే వీటి ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. 

Tags
Petrol diesel prices hiked after 5 states elections Pm modi
Recent Comments
Leave a Comment

Related News