విజయ్ విక్టరీ.. వైసీపీలో సంబరాలెందుకు?

admin
Published by Admin — May 04, 2026 in Politics, Andhra, National
News Image

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీతో మ్యాజిక్ ఫిగర్ దిశగా దూసుకుపోతున్న దళపతి విజయ్.. రాజకీయాల్లో కొత్త చరిత్రను లిఖిస్తున్నారు. అయితే ఈ గెలుపు చెన్నైలో జరిగితే, సంబరాలు మాత్రం తాడేపల్లి చుట్టుపక్కల కనిపిస్తున్నాయి. అసలు విజయ్ గెలుపుకు, వైసీపీకి ఉన్న సంబంధం ఏంటో అర్థం కాక సామాన్య జనం ముక్కున వేలేసుకుంటున్నారు.

వైసీపీ(YCP) శ్రేణులు విజయ్ విజయాన్ని ఓన్ చేసుకోవడం వెనుక ఒకే ఒక్క లక్ష్యం కనిపిస్తోంది. అదే జనసేనాని పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేయడం. "విజయ్ చూడు.. ఒంటరిగా గెలిచాడు, తొలి ప్రయత్నంలోనే సీఎం అయ్యాడు" అంటూ పోలికలు మొదలుపెట్టారు. గత ఎన్నికల్లో పవన్ రెండు చోట్ల ఓడిపోయిన వైనాన్ని తవ్వుతూ, విజయ్ ఇమేజ్‌ను అడ్డం పెట్టుకుని తమ రాజకీయ కసిని తీర్చుకుంటున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ తన పదేళ్ల పోరాటం తర్వాత ఏపీలో కింగ్ మేకర్ అయ్యారు. కానీ, వైసీపీ వాళ్లకు ఆ సక్సెస్ కంటే.. ఇప్పుడు విజయ్ సాధించిన షార్ట్ కట్ విజయం తమకి కావాల్సిన అస్త్రాన్ని ఇచ్చినట్లు అనిపిస్తోంది.

గతంలో ఒక వివాహ వేడుకలో విజయ్‌ను జగన్ పలకరించిన వీడియోను ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా విపరీతంగా షేర్ చేస్తోంది. అప్పట్లో జగన్‌ను విజయ్ కలిశారు కాబట్టే.. ఇప్పుడు ఆయన గెలిచారనే స్థాయిలో ఎలివేషన్లు ఇస్తున్నారు. అయితే ఇదే లాజిక్ ప్రకారం చూస్తే.. అదే పెళ్లిలో జగన్(Jagan) పక్కనే ప్రస్తుత సీఎం స్టాలిన్ కూడా ఉన్నారు. మరి వైసీపీ ముఖ్య నేత రోజా స్వయంగా వెళ్లి స్టాలిన్ తరపున ప్రచారం చేశారు. ఇప్పుడు స్టాలిన్ పరిస్థితి తారుమారైతే.. ఆ అపజయాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి వైసీపీ సిద్ధంగా ఉందా? అనేది నెటిజన్ల ప్రశ్న.

రాజకీయాల్లో ఎవరి పోరాటం వారిదే. విజయ్ తమిళనాడులో తనదైన వ్యూహంతో సక్సెస్ అయ్యారు. ఆయన గెలుపు వల్ల ఏపీలో వైసీపీకి వచ్చే అదనపు మైలేజీ ఏమీ లేదు. కానీ, సొంత రాష్ట్రంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పెంచిన పొలిటికల్ హీట్‌ను తట్టుకోలేక, పక్క రాష్ట్ర హీరోను అడ్డం పెట్టుకుని సెటైర్లు వేయడం చూస్తుంటే వైసీపీ నైరాశ్యంలో ఉందనేది స్పష్టమవుతోంది. మొత్తానికి, పవన్ కళ్యాణ్‌ను తక్కువ చేసి చూపే క్రమంలో విజయ్‌ని ఆకాశానికి ఎత్తేస్తున్న వైసీపీ.. తమ ఓటమిని మర్చిపోయి పక్క రాష్ట్ర ఫలితాల్లో ఆనందాన్ని వెతుక్కుంటోంది. ఈ తాత్కాలిక ఆనందం పార్టీకి ఎంతవరకు మేలు చేస్తుందో కాలమే నిర్ణయించాలి!

Tags
TN Election Results 2026 Vijay TVK Thalapathy Vijay Pawan Kalyan YSRCP YS Jagan AP Politics
Recent Comments
Leave a Comment

Related News