విజ‌య్ ప్ర‌భంజ‌నం.. ఊహించ‌ని విజ‌యం!

admin
Published by Admin — May 04, 2026 in National
News Image

త‌మిళ‌నాడులో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా టీవీకే(tvk)(త‌మిళ వెట్రి క‌ళ‌గం) ప్ర‌భంజ‌నం సృష్టించింది. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో 110 స్థానాల్లో ఆధిక్యం ప్ర‌ద‌ర్శించి.. ప్ర‌భుత్వ ఏర్పాటు దిశ‌గా వ‌డివ‌డిగా అడుగులు వే సింది. నిజానికి యాక్సిస్ మై ఇండియా స‌ర్వే సంస్థ త‌ప్ప‌.. ఎవ‌రూ విజ‌య్ అధికారంలోకి వ‌స్తార‌ని ఊహిం చలేదు. అంతేకాదు.. లెక్కులు కూడా ప‌క్కాగా ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ఉన్నాయ‌ని తేలిపోయాయి. కానీ, ప్ర‌జా తీర్పు .. యువ‌త నాడి దీనికి భిన్నంగా ఉన్నాయి.

మొత్తం 234 స్థానాలు ఉన్న త‌మిళ‌నాడు అసెంబ్లీలో ఇప్ప‌టి వ‌ర‌కు అధికారంలో ఉన్న డీఎంకే పార్టీనే తిరిగి అధికారంలోకి వ‌స్తుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అంతేకాదు.. స‌ర్వేల‌న్నీ కూడా స్టాలిన్ వైపు మొగ్గు చూపాయి. ముఖ్యంగా అన్నాడీఎంకే స‌హా విజ‌య్‌ను ప్ర‌జ‌లు ప‌ట్టించుకోలేద‌న్న స‌ర్వేలు.. అనేకం ఉన్నాయి. కానీ, ఆది నుంచి కూడా విజ‌య్(vijay) చాలా న‌మ్మ‌కంగా త‌న గెలుపుపై ప్ర‌క‌ట‌నలు చేస్తూ వ‌చ్చారు. త‌న పార్టీ త‌ర‌ఫున పోటీ చేసిన అభ్య‌ర్థుల గెలుపు ఖాయ‌మ‌ని చెప్పారు.

అంతేకాదు.. ఫ‌లితాల అనంత‌రం.. త‌న వారు ఎక్క‌డ జారిపోతారో అన్న వాద‌న కూడా వినిపించిన ఆయ‌న‌.. ప్ర‌త్యేకంగా పార్టీ కార్యాల‌యంలోనూ.. ఓ హోట‌ల్‌లోను కూడా వారికి శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇలా.. విజ‌య్ అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. కానీ, ప్ర‌త్య‌ర్థి పార్టీలు మాత్రం.. ఆయ‌న‌ను ఎద్దేవా చేశాయి. మూడో స్తానం కూడా ద‌క్క‌డం క‌ష్ట‌మ‌న్న వాద‌న‌ను వినిపించాయి. ఇలాంటి స‌మ‌యంలో అనూహ్యంగా విజ‌య్ 110 స్థానాల్లో ఆధిక్య‌త ప్ర‌ద‌ర్శించ‌డం.. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవ‌త‌రించ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, అధికార పార్టీ.. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే 52 స్థానాల‌కు ప‌రిమితం అయింది. అదేవిధంగా ఎన్నో ఆశ‌ల‌తో రంగంలోకి దిగిన అన్నాడీఎంకే(జ‌యల‌లిత పార్టీ) 72 స్థానాల్లో ఆధిక్య‌త ప్ర‌ద‌ర్శించింది. ఈ కూట‌మిలోనే బీజేపీ కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. కొన్ని కొన్ని స్థానాల్లో బీజేపీ అభ్య‌ర్థులు అన్న‌డీఎంకే గుర్తుపై పోటీ చేశారు. మొత్తంగా ఎవ‌రూ ఊహించ‌ని విధంగా విజ‌య్ విజ‌యం ద‌క్కించుకోవ‌డం.. గ‌మ‌నార్హం. ఫ‌లితాల స‌ర‌ళిని బ‌ట్టి.. త‌మిళ‌నాట విజ‌య్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టార‌నే చెప్పాలి.

Tags
Tvk vijay tamilnadu election results
Recent Comments
Leave a Comment

Related News