అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోటి దురుసుతనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తీరు మరింత ముదిరి.. కనీస మర్యాదలను పక్కన పెట్టి మాట్లాడేస్తే ఎలాఉంటుందన్న దానికి నిదర్శనంగా నిలుస్తున్నారు ఉగాండా ఆర్మీ చీఫ్ జనరల్ ముహూజీ కైనెరుగాబా. చెత్త మాటకు కేరాఫ్ అడ్రస్ గా మాట్లాడే ఇతగాడి బుద్ధి.. బుర్ర ఎంత వక్రంగా ఉంటుందన్న దానికి నిదర్శనంగా అతడి మాటలు ఉంటాయి. వెనుకా ముందు చేూసుకోకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడే తీరు ఇతడిలో ఎక్కువ. తాజాగా తుర్కియే (టర్కీ) ముందు రెండు వింత డిమాండ్లు పెట్టాడు. అందులో ఒకటైతే మరింత వికృతంగా ఉండటమే కాదు.. లాగి పెట్టి రెండు పీకాలన్నంత కోపం వచ్చేలా ఉంది.
అదేమంటే.. సోమాలియాలో ఇస్లామిక్ మిలిటెంట్లకు వ్యతిరేకంగా తాము దీర్ఘకాలంగా సైనిక సేవలు అందిస్తున్న దానికి ప్రతిగా ఒక బిలియన్ డాలర్లు (మన రూపాయిల్లో చెప్పాలంటే 9300 కోట్లు), అదే విధంగా తాను పెళ్లి చేసుకోవటానికి తుర్కియేలోని అత్యంత అందమైన అమ్మాయిని తన దేశానికి పంపాలని.. ఆమెను తాను పెళ్లి చేసుకుంటానంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశాడు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చెత్త మాటలకు 30 రోజుల గడువును ఇవ్వటం గమనార్హం.
తన డిమాండ్లను 30 రోజుల్లో తుర్కియే అంగీకరించని పక్షంలో.. దౌత్యపరంగా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోకోవాల్సి ఉంటుందన్న హెచ్చరికతో పాటు.. తమ దేశంలోని తుర్కియో రాయబార కార్యాలయాన్ని మూసివేస్తామని.. తమ గగనతలంలో ఎయిర్ లైన్స్ విమానాల్ని నిలిపివేస్తామని.. అన్ని దౌత్య సంబంధాలను వదులుకుంటామని వార్నింగ్ ఇవ్వటం గమనార్హం. అంతేకాదు.. భద్రతలో భాగంగా తుర్కియేకు ఉగాండా ప్రజలు ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచన చేశాడు. అయితే.. ఈ పోస్టు మీద తీవ్ర విమర్శలు రావటంతో దీన్ని తొలగించాడు. అయినప్పటికీ ఈ రచ్చ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. దీనిపై తుర్కియే ఇప్పటివరకు స్పందించలేదు.
ఇంతకూ ఈ సైనిక జనరల్ ఎవరు? ఇలా నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతుంటే.. ఆ దేశ అధ్యక్షుడు ఏం చేస్తున్నట్లు? అన్న సందేహం రావొచ్చు. అక్కడికే వస్తున్నాం. ఇంత చెత్త వాగుడు వాగిన కైనెరుగాబా ఎవరో కాదు.. ఉగాండా అధ్యక్షుడు యోవేరి ముసెవెని కుమారుడే. తరచూ నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం ఇతడికి అలవాటే. గతంలోనూ ఇతను ఇటలీ ప్రధానిని ఉద్దేశించి నోరు పారేసుకున్నారు. 2022లో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిని వివాహం చేసుకుంటానని.. ఆమెను తనకు అప్పగిస్తే.. అందుకు బదులుగా వంద అంకోలే జాతి ఆవులను ఇస్తానని బహిరంగంగా ప్రకటించారు.
ఇతగాడి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావటంతో ఆయన తండ్రి కం ఉగాండా అధ్యక్షుడు యోవేరి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. తన తండ్రి తర్వాత తానే ఉగాండా అధ్యక్షుడిగా చెప్పుకునే కైనెరుగాబా తరచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. 2022లో కెన్యాపై తన సైన్యంతో కలిసి దండెత్తుతానని.. రెండు వారాల్లో నైరోబీని స్వాధీనం చేసుకుంటానని వార్నింగ్ ఇచ్చిన ఘన చరిత్ర ఇతగాడి సొంతం. ఆ టైంలోనూ ఆయన తండ్రి సారీ చెప్పాల్సి వచ్చింది. అంతేకాదు.. రక్షణ దళాల అధిపతి పోస్టు నుంచి తాత్కాలికంగా తొలగించారు. కెన్యాకు సారీ చెప్పారు.
నోటికి వచ్చినట్లుగా చెత్త వాగుడు వాగే.. కొడుకు తీరుతో ఉగాండా అధ్యక్షుల వారు తరచూ ఇరుకు పడుతూ ఉంటారు. ఇదంతా చదివిన తర్వాత కొన్ని సందేహాలు వస్తాయి. అవేమంటే.. ఎక్కడ తుర్కియో? ఎక్కడ సోమాలియా? మరెక్కడ ఉగాండా? సోమాలియాకు ఉగాండా రక్షణ ఇస్తే.. తుర్కియో డబ్బులు ఎందుకు ఇవ్వాలి? దేశంలోనే అత్యంత అందమైన అమ్మాయిని ఎందుకు పంపాలి? ఈ విచిత్రమైన బ్లాక్ మొయిల్ వెనుక అసలు సంగతి ఏంటి? అన్నది చూస్తే.. సోమాలియాలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన దేశాల్లో తుర్కియో ముందు ఉంటుంది. భౌగోళికంగా చూసినా.. తుర్కియోకు.. సోమాలియాకు మధ్య భౌగోళిక దూరం చాలా తక్కువ. కాకుంటే.. ఆ దేశంతో తుర్కియోకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
అయితే.. సోమాలియాలోని ఉగ్రవాద సంస్థల్ని తుదముట్టించేందుకు ఉగాండా తన సైన్యాన్ని ఆ దేశానికి పంపింది. తాము సోమాలియాకు వెళ్లి.. తమ సైనికులు తమ రక్తంతో ఆ దేశాన్ని కాపాడుతుంటే.. ఆ దేశంలో తుర్కియో పెద్ద ఎత్తున వ్యాపారాలు చేస్తూ లాభాలు గడించటం ఏమిటి? అందుకే భారీగా డబ్బులు.. అందమైన అమ్మాయి అంటూ దరిద్రపుగొట్టు డిమాండ్ ను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీనిపై తుర్కియో