జ‌నం టాక్‌:  జ‌గ‌న్‌.. అప‌రిప‌క్వ నేత‌!

admin
Published by Admin — April 13, 2026 in Politics
News Image
వైసిపి అధినేత జగన్ ప్రకటించిన `మావిగన్‌` రాజధాని అంశం ప్రజల్లో ఏ విధంగా ఉంది? అనే అంశంపై కీలక మీడియా ఛానళ్లు నిర్వహించిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగు చూసాయి. జగన్ ఒక అపరిపక్వ నాయకుడిగా ప్రజలు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు అమరావతి రాజధానికి చట్టబద్ధత రావడం, మరోవైపు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ముందుకు సాగడం, అమరావతి రాజధాని పనులు వ‌డివ‌డిగా సాగుతూ ఉండడం వంటి అంశాలు ప్రజలు గమనిస్తున్నారు.

ప్రభుత్వం కూడా సీరియస్ గా ఈ పనులను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇటువంటి సమయంలో వైసిపి అధినేతగా జగన్ అమరావతికి మద్దతు ప‌లికి ఉంటే ఏ ఇబ్బంది ఉండేది కాదు. సహజంగా తప్పులు ఎవరైనా చేస్తారు. వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేస్తారు. కానీ, జగన్ విషయంలో తప్పులు చేయటమే తప్ప సరిదిద్దుకునే దిశగా అడుగులు వేయటం అన్నది ఇప్పటివరకు కనిపించటం లేదన్నది ప్రజలు చెబుతున్నారు.

ముఖ్యంగా మావిగన్‌ను మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ వాసులు సైతం వ్యతిరేకిస్తున్నారు. కొందరు ఇది ఎలాగో రాజధాని పరిధిలోనే ఉంది కాబట్టి ప్రత్యేకంగా దీనిని అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదన్నది ఒక వాదన ఉంది, దీనికి మరొక ప్రధాన కారణం కూడా కనిపిస్తుంది,, మావిగన్ ప్రాంతాన్ని డెవలప్ చేయాలి అంటే ప్రస్తుతం ఉన్న నిర్మాణాలకు కూల్చివేసి లేదా కొత్త‌గా భూములు సేకరించి కొత్తగా నిర్మాణాలు చేపట్టాలి. తద్వారా ప్రస్తుతం ఉన్న విజయవాడ మరింతగా తగ్గిపోతుందన్నది ఎక్కువమంది చెబుతున్నారు.

ఇక గుంటూరులో ఇప్పటికే రాజధానికి సంబంధించిన భూముల సమీకరణ జరిగిపోయింది. కాబట్టి అక్కడ డెవలప్ చేసుకుంటే ఎవరికి ఇబ్బంది లేదని కూడా చెబుతున్నారు. ఇదే సమయంలో సిఆర్డిఏ పరిధిలోనే విజయవాడ, మచిలీపట్నం అంటివి ఉన్నాయి. కాబట్టి ఎలాగూ గుంటూరు ప్రాంతం రాజధాని లోనే ఉన్న నేపథ్యంలో ప్రత్యేకంగా మావిగన్ అనే మాటే అవసరం లేదన్నది మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా జనం ఈ విషయంలో స్పష్టంగా ఉన్నారు.

 వైసిపి అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులు ప్రకటన చేసిన సమయంలో కూడా విశాఖపట్నం వాసులు ఇదే మాట చెప్పారు. తమకు రాజధాని అవసరం లేదని అక్కడ ప్రజలు కుండబద్దలు కొట్టారు. అయినప్పటికీ వైసీపీ విధానపరమైన నిర్ణయాన్ని మార్చుకోలేకపోయింది. తద్వారా ఎటువంటి పరిస్థితి ఎదుర్కొన్నది గత ఎన్నికలు స్పష్టం చేశాయి. ఇప్పుడు మావిగన్ కూడా అలానే వైసీపీకి ఇబ్బందిగా మారుతుంది. మెజారిటీ ప్రజలు ఎవరు మావిగన్ పై అంత అనుకూలంగా కానీ సానుకూలంగా కానీ స్పందించడం లేదు. అంతేకాదు జగన్ అపరిపక్వతను ఈ వ్యవహారం మరింతగా పట్టి చూపుతోంది అనే మాట పరిశీలకల నుంచి కూడా వినిపిస్తోంది.
Tags
jagan immature leader tdp ycp cm chandrababu
Recent Comments
Leave a Comment

Related News