అమెరికాకు ఇరాన్ ‘బాహుబలి’ రేంజ్ వార్నింగ్

admin
Published by Admin — September 28, 2026 in International
News Image

ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన దేశం అమెరికాను సైతం ఇరాన్ ముప్పుతిప్పలు పెడుతున్న సంగతి తెలిసిందే. గతంలో అమెరికాను ఉడికిస్తూ ఒక సైకిల్ మీద వెళుతున్న సోల్జర్ వీడియో ఎంత వైరల్ అయిందో తెలిసిందే. ఇక, ఇటీవల నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' సినిమాలో క్లిప్‌ ను జింబాబ్వేలోని ఇరాన్ రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అమెరికాకు గట్టి మెసేజ్ ఇచ్చింది.

ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్ 'బాహుబలి' చిత్రంలోని సీన్ తో అమెరికాకు తలొగ్గేదే లేదని...తగ్గేదే లేదని వార్నింగ్ ఇచ్చింది. ’బాహుబలి'లో కాలకేయులతో బాహుబలి ఫైట్ చేసే సీన్ ను హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ కార్యాలయం తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. "మేము ఎవరికీ తలవంచబోమని మా అధ్యక్షుడు పెజెష్కియాన్ ఐక్యరాజ్యసమితి సమావేశంలో ఇప్పటికే స్పష్టం చేశారు.

బాహుబలి కాలకేయులను ఎదిరించినట్లే, మేము కూడా మా మాతృభూమి రక్షణ కోసం రక్తం చిందించడానికైనా, ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం" అని ఇరాన్ ఎంబసీ పోస్ట్ చేసింది. అమెరికాకు వార్నింగ్ ఇచ్చేందుకు ఇరాన్ తెలుగు బ్లాక్ బస్టర్ సినిమాల్లో సీన్లు వాడుకోవడంతో తెలుగు సినిమా ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో మరోసారి చర్చనీయాంశమైంది.

Tags
Iran USA war Bahubali movie scene warning
Recent Comments
Leave a Comment

Related News