కేసీఆర్ కు కవిత బిగ్ షాక్!

admin
Published by Admin — April 04, 2026 in Telangana
News Image

పోయిన చోటే వెతుక్కోమన్నారు పెద్దలు. గులాబీ బాస్ కేసీఆర్(kcr) కుమార్తె కం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(kavita) భారీ ప్లానింగ్ లో ఉన్నారా? అన్నదిప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. కారణం.. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలే. త్వరలో రాజకీయ పార్టీ పెట్టేందుకు ప్లానింగ్ చేస్తున్న ఆమె.. అందుకు తగ్గ సమయం కోసం చూస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఆమె మాట్లాడుతూ.. పాత పేరు.. కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తానని చెప్పటం గమనార్హం.

కవిత చెప్పినట్లు పాత పేరు అంటే టీఆర్ఎస్(trs)(?) అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. నిజానికి తెలంగాణ రాజకీయ వర్గాల మధ్య జరిగే చర్చల్లో తరచూ వినిపించే మాట ఏమంటే.. ఎప్పుడైతే కేసీఆర్ తన పార్టీ పేరును టీఆర్ఎస్ కు బదులుగా బీఆర్ఎస్ మార్చారో.. అప్పటి నుంచి పార్టీకి డౌన్ ఫాలో స్టార్ట్ అయినట్లుగా చెబుతారు. టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ సెంటిమెంట్ పుష్కలంగా ఉంటుందని.. అలాంటి బ్రహ్మాస్త్రాన్ని పక్కన పెట్టేసి బీఆర్ఎస్ అంటూ సంబంధం లేని అంశాల్ని నెత్తిన వేసుకొని మొదటికే మోసం తెచ్చుకున్న పరిస్థితికి కేసీఆర్ తెచ్చుకున్నారన్న మాట ప్రచారంలో ఉంది.

ఇదిలా ఉండగా.. కవిత మాట్లాడుతూ తాను పాత పేరుతో.. కొత్త అజెండాతో వస్తానని చెబుతునూ.. తమ పార్టీకి ఆచార్య జయశంకర్ సిద్ధాంతాల ప్రకారమే నడుస్తుందని చెప్పారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పేరు ఫ్రీ అయ్యిందని.. దాన్ని ఇప్పుడు ఎవరైనా వాడుకోవచ్చన్న మాటలు గులాబీ పార్టీలో కొత్త గుబులుగా మారింది. ఒకవేళ.. కవిత చెప్పినట్లే తాను పెట్టే పార్టీకి టీఆర్ఎస్ పేరు పెడితే మాత్రం గులాబీ పార్టీకి భారీ డ్యామేజ్ ఖాయమన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో కాలమే చెప్పాలి.

Tags
trs brs kcr kalvakuntla kavita telangana jagruti New party
Recent Comments
Leave a Comment

Related News